భారత క్రికెట్ భవిష్యత్తుకు పునాది వేసే టోర్నమెంట్లలో ఒకటైన అండర్-19 (Asia Cup U-19) ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును BCCI ప్రకటించింది. యువ క్రికెట్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ వన్డే టోర్నమెంట్, వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 (Asia Cup U-19) ప్రపంచకప్‌కు సన్నాహకంగా కూడా ఉపయోగపడుతుంది.
Read Also: WPL 2026 Auction: WPL మెగా వేలంలో సత్తా చాటిన తెలుగమ్మాయిలు
కెప్టెన్ గా ఆయుష్ మాత్రే
ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కి చోటు దక్కింది. డిసెంబర్ 14న IND-PAK తలపడనున్నాయి. IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్య వంశీ, విహాన్ (VC), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్
ఈ టోర్నమెంట్‌కు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జట్టులో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ఆయుష్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను విహాన్ మల్హోత్రాకు అప్పగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: