Latest News: Asia Cup Rising Stars 2025: బంగ్లాపై పాక్ గెలుపు

Read Time:  1 min
Latest News: Asia Cup Rising Stars 2025: బంగ్లాపై పాక్ గెలుపు
FONT SIZE
GET APP

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీ (Asia Cup Rising Stars 2025) లో పాకిస్థాన్ షాహీన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం దోహా వేదికగా బంగ్లాదేశ్-ఏ జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్ షాహీన్స్ సూపర్ ఓవర్‌‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్-ఏ.. పాకిస్థాన్‌ను 125 పరుగులకే ఆలౌట్ చేసింది.

Read Also: Muthusamy Record: సౌతాఫ్రికా స్టార్ ముత్తుసామి సెన్సేషనల్ బ్యాటింగ్

Asia Cup Rising Stars 2025: Pakistan win over Bangladesh
Asia Cup Rising Stars 2025: Pakistan win over Bangladesh

మూడోసారి టైటిల్ గెలిచిన ఏకైక జట్టు

బంగ్లా బౌలర్ రిపోన్ మండల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ గట్టిగా పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 125 పరుగులు చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

సూపర్ ఓవర్‌లో పాక్ బౌలర్ అహ్మద్ డానియల్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్‌ను 2 వికెట్ల నష్టానికి కేవలం 6 పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం 7 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్-ఏ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాకిస్థాన్-ఏ ఈ టోర్నీ చరిత్రలో మూడోసారి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.