📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్‌..సెల్ఫీ స్టిక్, టపాసులపై నిషేధం?

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌ మ్యాచ్ క్రమంగా ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది. 40 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ పోరులో ముఖాముఖి ఎదుర్కోవడం ఇది మొదటిసారి. ఈ ప్రత్యేకమైన ఘట్టం వల్ల అభిమానుల్లో, క్రికెట్ లవర్స్‌లో ఉత్కంఠ, ఆసక్తి అద్భుతంగా పెరిగింది. ఇరువురు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ శ్రద్ధ, ప్రాక్టీస్, మరియు వ్యూహాత్మక తీరుతో ఫైనల్‌కి పూర్తిగా సిద్ధమయ్యారు.

BCCI: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించబోయే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Stadium), ఆ మ్యాచ్‌కు ఇప్పటికే భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.అంతేకాదు స్టేడియానికి వచ్చే అభిమానులకు కీలక ఆదేశాలు జారీ చేసిందీ సంస్థ.చిరకాల ప్రత్యర్ధులైన భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు టాస్ వేయనున్నారు.

అనంతరం 30 నిమిషాల్లో తొలిబంతి పడనుంది. దాంతో.. ప్రశాంత వాతావరణంలో మ్యాచ్‌ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు భద్రతా బలగాలు. హై ఓల్టేజ్ మ్యాచ్‌ (High voltage match) లో ఇరు దేశాల అభిమానులు హద్దు దాటకుండా చూసేందుకు కొన్ని కీలక సూచనలు, జాగ్రత్తలు పాటించాలని కోరింది.

Asia Cup 2025

మూడు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి

అవేంటంటే..మ్యాచ్‌ సమయం రాత్రి 8:30 కాబట్టి అభిమానులు మూడు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలి. ఒకే టికెట్‌కు ఒకరినే అనుమతిస్తారు. మ్యాచ్ మధ్యలో బయటకువెళ్లిన వాళ్లను తిరిగి లోపలికి అనుమతించరు.

నిర్వాహకులు, భద్రతా దళాలు (Security forces) సూచించిన జాగ్రత్తలను విధిగా పాటించాలి. వాహనాలను పార్కింగ్ ప్రదేశంలోనే నిలపాలి. అలానే దారికి అడ్డంగా.. రోడ్డు మధ్యలో వాహనాల్ని పార్క్ చేయరాదు.

హానికరమైన వస్తువులను స్టేడియం లోపలికి అనుమతించరు

నిషేధిత వస్తువులను స్టేడియంలోకి తీసుకెళ్లరాదు.టపాసులు, లేజర్ పాయింటర్స్‌తో పాటు పేలుడు పదార్థాలు, హానికరమైన వస్తువులను స్టేడియం లోపలికి అనుమతించరు. కత్తి, బ్లేడ్ వంటి పదునైన వస్తువులు.. విష పదార్థాలు, రిమోట్‌తో కంట్రోల్ చేయగలిగే పరికరాలను తీసుకెళ్లకూడదు.

పెద్ద గొడుగులు, కెమెరా ట్రైపాడ్స్, సెల్ఫీ కర్రలు తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. నిర్వాహకులు అనుమతించని బ్యానర్లు, జెండాలు, సంజ్ఞలతో కూడిన వస్తువులను తీసుకెళ్లకూడదు. అలానే.. పెంపుడు జంతువులు, సైకిళ్లు, స్కేట్‌బోర్డులు, స్కూటర్లు, గాజు పదార్థాలను నిషేధించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Final Breaking News cricket security measures Dubai International Stadium fan safety guidelines first india pakistan final historic cricket final India vs Pakistan final latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.