Asia Cup-ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్, తమ జట్టు స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా అభివర్ణించారు. శనివారం జరిగిన ఆసియా కప్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, “మా జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నా, నవాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు నెలలుగా అతడు నిరంతరం మంచి ప్రదర్శన ఇస్తున్నాడు” అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నవాజ్ 30వ స్థానంలో ఉండటంతో, ఈ వ్యాఖ్యలు కేవలం ఆసియా కప్‌లో మైండ్ గేమ్(Mind game) మాత్రమేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత శిబిరం స్పందన
హెసన్ వ్యాఖ్యలపై స్పందించిన భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే, “ప్రతి జట్టుకు తమ ఆటగాళ్లపై సొంత అభిప్రాయాలు ఉండటం సహజం. వాళ్లు తమ ఆటగాళ్లకు ఎలాంటి ర్యాంక్ ఇచ్చుకున్నా అది వారి నిర్ణయం” అన్నారు. ఆయన మాటలతో భారత జట్టు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయిందనే విషయం స్పష్టమైంది.
స్పిన్నర్ల ప్రాధాన్యం పెరుగుతోన్న టోర్నమెంట్
“ఈ టోర్నమెంట్‌లో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకం అవుతుంది. టీ20 క్రికెట్(T20 Cricket)లో స్పిన్ ఇప్పుడు ప్రధాన భాగం. ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. మా జట్టులో వరుణ్, అక్షర్, కుల్దీప్‌లపై మాకు పూర్తి విశ్వాసం ఉంది” అని ర్యాన్ టెన్ డెస్కాటే అన్నారు. దీంతో మైదానంలో ఇరు జట్ల స్పిన్నర్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ పెరిగింది.
మైక్ హెసన్ ఎవరిని అత్యుత్తమ స్పిన్నర్‌గా పేర్కొన్నారు?
పాకిస్థాన్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌ను అత్యుత్తముడిగా అన్నారు.
నవాజ్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎక్కడ ఉన్నాడు?
అతను టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్నాడు.
Read hindi News: Hindi.vaartha.com
Read also: