📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 9:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన ఫైనల్ మ్యాచ్‌ చివరికి ప్రారంభమైంది. ఇండియా – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరాటం ఎప్పుడూ ప్రత్యేకమే. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తెలిపాడు.

‘మేం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. రాత్రి లైట్ల కింద పిచ్ మరింత మెరుగవుతుంది. మేం గత మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేశాం. కానీ ఈ రోజు లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నిస్తాం.

Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్‌..సెల్ఫీ స్టిక్, టపాసులపై నిషేధం?

పిచ్ తయారీ విషయంలో ఇక్కడి గ్రౌండ్స్‌మెన్ అద్భుతంగా పని చేశారు. గత 5-6 మ్యాచ్‌ల్లో మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ మ్యాచ్ ఆడటం లేదు. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి రాగా.. శివమ్ దూబే, జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చారు.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Asia Cup 2025

మరోవైపు ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తాము సంతోషంగా ఉన్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Captain Salman Ali Agha) తెలిపాడు. ‘ఈ మ్యాచ్ కోసం మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూశాం. మేం ఇంత వరకు ఒక గొప్ప మ్యాచ్ ఆడలేదు. కానీ ఈ రోజు ఆడుతామని ఆశిస్తున్నాం. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు

మేం ఈ పిచ్‌లపై కొంత కాలంగా ఆడుతున్నాం. ఇది కూడా అలానే ఉంటుందని భావిస్తున్నాం.’అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్),

శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.పాకిస్థాన్ : సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Final Breaking News india chose bowling India vs Pakistan india won toss latest news night match advantage pitch conditions suryakumar yadav captain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.