📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించిన భారత జట్టు, వరుసగా ఆరవ విజయాన్ని కూడా నమోదు చేసింది. ఈ సారి ఎదురుగా నిలిచింది ఆసియా క్రికెట్‌లో గట్టి పోటీదారైన శ్రీలంక. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ మొదటి బంతి నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లూ గెలుపుకోసం ఆఖరి వరకు పోరాడగా, చివరికి సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది.

KL Rahul : లక్నోలో అద్భుత విజయం

Asia Cup 2025

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో

హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్‌తో ఓటమిని తప్పించుకుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ (Bharat) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కుశాల్ పెరీరా(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. డసన్ షనక(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

హీరో పాతుమ్ నిస్సంకను క్యాచ్ ఔట్‌గా

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు.ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా.. హర్షిత్ రాణా (Harshit Rana) తొలి బంతికే సెంచరీ హీరో పాతుమ్ నిస్సంకను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాతి మూడు బంతుల్లో 5 పరుగులు రాగా.. ఐదో బంతిని షనక బౌండరీ తరలించాడు. దాంతో ఆఖరి బంతికి శ్రీలంక విజయానికి మూడు పరుగులు అవసరం కాగా.. రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.

దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతుమ్ నిస్సంక వికెట్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది.సూపర్ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ (Arshdeep Singh) బౌలింగ్ చేయగా.. తొలి బంతికే కుశాల్ పెరీరా(0) ఔటయ్యాడు. తర్వాతి రెండు బంతులకు వైడ్ సాయంతో రెండు పరుగులే రాగా.. నాలుగో బంతికి డసన్ షనక సింగిల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. అయితే రనౌట్ కంటే ముందే అంపైర్ క్యాచ్ ఔట్‌ ఇవ్వగా.. షనక రివ్యూ తీసుకున్నాడు.

అంపైర్లు ఆటగాళ్లకు వివరించి చెప్పారు.

కానీ బంతి బ్యాట్‌కు తగలకపోవడంతో నాటౌట్‌గా తేలింది. అంపైర్ నిర్ణయం తర్వాత బంతి డెడ్ అవుతుంది. కాబట్టి రనౌట్‌ లెక్కలోకి రాదు. దాంతో షనక ఔటవ్వకుండా బచాయించాడు.ఈ నిర్ణయం అభిమానులతో పాటు భారత ఆటగాళ్లను అయోమయానికి గురి చేసింది. కానీ అంపైర్లు ఆటగాళ్లకు వివరించి చెప్పారు.

కానీ మరుసటి బంతికే షనక క్యాచ్ ఔటయ్యాడు. దాంతో భారత్ లక్ష్యం మూడు పరుగులుగా నమోదైంది. అనంతరం భారత్ ఒక్క బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది.ఏకపక్ష మ్యాచ్‌లతో చప్పగా సాగిన ఆసియా కప్ 2025 టోర్నీలో ఈ మ్యాచ్‌ అసలు సిసలు మజా అందించింది. చరిత్రలో నిలిచిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Breaking News Harshit Rana bowling India vs Sri Lanka match latest news Super Over thriller Team India winning streak Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.