📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: సొంత దేశ టీమ్ మేనేజ్మెంట్‌పై షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు ఓటమి తర్వాత ఆ దేశ మాజీ వేగవంత బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు సత్తా చాటుతూ మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టోర్నీలో ప్రతి దశలోనూ అగ్రగామిగా ఉన్న భారత్, పాకిస్తాన్‌పై ఫైనల్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

 Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు అంకితం..

గ్రూప్ దశలో, సూపర్-4లో ఇప్పటికే భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్ కొంతవరకు గట్టి పోటీ ఇచ్చినా.. చివరికి భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాక్ ఓటమి తర్వాత మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమ్ మేనేజ్మెంట్‌ (Team Management) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. “దురదృష్టవశాత్తూ, ఇది జట్టు సమస్య కాదు. మిడిల్ ఆర్డర్ సమస్య అనేది సరైన ఆటగాళ్లను ఎంపిక చేయని మేనేజ్మెంట్ చేసిన తప్పు.

నేను చెప్పాలంటే, ఇది అర్థరహితమైన కోచింగ్. ఇలాంటి పదాలు వాడినందుకు క్షమించండి, కానీ ఇది అర్థరహితమైన కోచింగ్. మా మ్యాచ్ విన్నర్స్ అయిన హసన్ నవాజ్, సల్మాన్ మీర్జా లాంటి వాళ్లు ఉన్నారు. పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. మేము చాలా నిరాశ చెందాం” అని అన్నారు.తన అభిప్రాయాలను ఎప్పుడైనా నిర్భయంగా చెప్పే షోయబ్ అక్తర్ (Shoaib Akhtar).. పాకిస్తాన్ ఓటమి తర్వాత సరిగా మాట్లాడలేకపోయారు.

Asia Cup 2025

అక్తర్ ఇంకా మాట్లాడుతూ..

ఆయన స్వరం తడబడింది. ఓ విషయాన్ని పూర్తిగా చెప్పకముందే మరో విషయం గురించి మాట్లాడటం ప్రారంభించారు. అక్తర్ ఇంకా మాట్లాడుతూ.. “ఇది సూపర్ సండే, దేశమంతా చూస్తోంది. మా మిడిల్ ఆర్డర్‌ (Middle order) లో ముందు నుంచే సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరూ ఇదే చెబుతున్నారు” అని తన నిరాశను వ్యక్తపరిచారు.మొదట కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను 19.1 ఓవర్లలో 146 పరుగులకే పరిమితం చేశారు.

ఒకానొక సమయంలో పాకిస్తాన్ స్కోరు ఒక వికెట్‌కు 113 పరుగులుగా ఉన్నప్పుడు.. అది 180 పరుగులు దాటుతుందని భావించారు. ఆ తర్వాత, భారత్ బ్యాటింగ్‌లో కూడా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత తిలక్ వర్మ (Tilak Verma) అజేయమైన అర్ధ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆయన సంజూ శాంసన్‌తో కలిసి 57 పరుగులు, శివమ్ దూబేతో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Final Breaking News Dubai International Cricket Stadium India champions India vs Pakistan latest news pakistan defeat Shoaib Akhtar reaction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.