📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: శ్రీలంకపై పాక్ ఘన విజయం

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్‌ 2025 (Asia Cup 2025)లో కీలక మలుపు తిరిగింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సమష్టిగా రాణించి శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ బరిలో నిలబడే అవకాశాలను మరింత బలపరచుకుంది. మరోవైపు, శ్రీలంకకు మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇకపై అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశం లేదు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక (Sri Lanka) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది.

కామిందు మెండిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ చరిత్ అసలంక (Captain Charith Asalanka)(20)తో పాటు కుశాల్ మెండీస్(0), డసన్ షనక(0), పాతుమ్ నిస్సంక(8) తీవ్రంగా నిరాశపర్చారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/28) మూడు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్(2/37), హుస్సేన్ తలత్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు.

Asia Cup 2025

పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి

అబ్రర్ అహ్మద్ (Abrar Ahmed) ఒక వికెట్ తీసాడు.అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి 12 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. హుస్సేన్ తలత్(30 బంతుల్లో 4 ఫోర్లతో 32 నాటౌట్), మహహ్మద్ నవాజ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ(2/24), వానిందు హసరంగా(2/27) రెండేసి వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా(1/31) ఒక వికెట్ పడగొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Breaking News five wicket win latest news Pakistan keeps final hopes alive Pakistan victory Pakistan vs Sri Lanka Sri Lanka final hopes slim Super 4 Match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.