ఆసియా కప్ 2025 (Asia Cup 2025)ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌పై గెలిచి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయానంతరం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన చోటుచేసుకుంది. ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆసియా కప్ ట్రోఫీతో పాటు విజేతలకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను తనవద్దే ఉంచుకున్నారు. ఈ చర్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Shahid Afridi: పీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ షాహిద్ అఫ్రిది డిమాండ్
ఏసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ట్రోఫీని, మెడల్స్‌ను భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ పేర్కొన్నట్లు సమాచారం.
ఈ అంశాన్ని బీసీసీఐ, ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ట్రోఫీ చౌర్యం, నియమాలను ఉల్లంఘించినందుకు నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) చీఫ్ పదవి నుంచి తొలగించి, అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ, ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు
ఈ పరిణామాల నేపథ్యంలో ఆందోళన చెందిన నఖ్వీ, ఆసియా ట్రోఫీని, మెడల్స్‌ను యూఏఈ బోర్డుకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, వాటిని ఆ బోర్డు టీమిండియా (Team India) కు ఎలా అందజేస్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మంగళవారం వర్చువల్‌గా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు నఖ్వీని ప్రశ్నించారు. ఆసియా టోర్నీ కప్ టీమిండియాకు చెందుతుందని, అది వ్యక్తిగత ఆస్తి కాదని బీసీసీఐ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: