ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ జట్టు ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(Dubai International Cricket Stadium) లో జరిగిన ఈ టైటిల్ పోరులో భారత్ చేతిలో మరోసారి పాకిస్థాన్ పరాజయం పాలైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే రన్నరప్ చెక్కును తీసుకున్న పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Pakistan captain Salman Ali Agha) ఆగ్రహంతో దాన్ని పక్కకు విసిరేయడం అక్కడి ప్రేక్షకులను తీవ్రంగా ఆవేశపరిచింది.
Asia Cup 2025: టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ హర్షం
ఈ ఘటనతో స్టేడియంలో హాజరైన అభిమానులు గట్టిగా అరుస్తూ, తిట్టుతూ నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది.ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తిలక్ వర్మ (Tilak Verma)అద్భుతంగా ఆడాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్- 24, శివం దూబే-33 తో కలిసి భారీ ఇన్నింగ్ నిర్మించడంతో గెలుపు ఖాయమైంది.
పాకిస్తాన్ జట్టు కు భారత్ చేతిలో ఈ టోర్నీలో ఇది మూడో ఓటమి
పాకిస్తాన్ జట్టు కు భారత్ చేతిలో ఈ టోర్నీలో ఇది మూడో ఓటమి.ఈ ఓటమి ఆఘాను నిరాశకు గురి చేసినట్టయింది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ (Match presentation) సందర్భంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నరప్ చెక్కును అందుకున్న అనంతరం దాన్ని కోపంతో విసిరేశాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ చర్యపై నెటిజన్ల నుండి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలా మంది అతని ప్రవర్తనను క్రీడాస్ఫూర్తికి (Sportsmanship) విరుద్ధమని అభిప్రాయపడ్డారు.ఓటమి అనంతరం ఆఘా మాట్లాడాడు. ఓటమి నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు.
బ్యాటింగ్‌లో విఫలం కావడమే ఓటమికి దారి తీసిందని పేర్కొన్నాడు. బ్యాటింగ్ సరిగ్గా చేలేకపోయామని, బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. గెలవడానికి తమవంతు ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌లో చివరి వరకు ఆడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని పేర్కొన్నాడ ఆఘా. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయామని అంగీకరించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: