చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ మరోసారి ఆధిపత్యాన్ని చూపించింది. ఆసియాకప్ 2025 ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రారంభంలో ఒత్తిడికి గురై ఐదు ఓవర్లలోనే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మధ్యంతర భాగంలో రాణించిన బ్యాట్స్‌మెన్ విజయాన్ని భారత్ వైపు తిప్పారు.
Read Also: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు అంకితం..
పాకిస్థాన్ వరుస పరాజయాలు – అభిమానుల ఆగ్రహం
ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి తాలూకూ షాక్‌తో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తి(Dissatisfaction) వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తమైంది.
పాక్ యూట్యూబర్ వీడియో వైరల్
పాకిస్థాన్ యూట్యూబర్ షోయబ్ చౌధరి(Shoaib Chaudhary) ఇంటర్వ్యూలో ఒక అభిమాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారత్ చేతిలో ఓటమి పాకిస్తాన్ జట్టుకు “పాత అలవాటు” అయ్యిందని అతడు వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఓటములు ఇక భరించలేమని, ఆటగాళ్లు భావోద్వేగాలకే లోనవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అభిమానుల విమర్శలు – పీసీబీపై ప్రశ్నలు
పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తూ, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చినా పెద్ద మ్యాచ్‌లలో వారి అనుభవం లేకపోవడం పరాజయానికి కారణమైందని ఆరోపించారు. మరోవైపు, భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్‌ను తన వైపు తిప్పుకుందని పేర్కొన్నారు.
ఆసియాకప్ 2025 ఫైనల్లో భారత్ ఎన్ని వికెట్ల తేడాతో గెలిచింది?
భారత్ పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
పాకిస్థాన్ ఈ టోర్నీలో ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయింది?
పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌లన్నింటిలోనూ ఓటమి పాలైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: