📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Telugu News: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు అంకితం..

Author Icon By Pooja
Updated: September 29, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియాకప్ 2025లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై ఉత్కంఠభరితమైన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలిచి భారత్ తొమ్మిదోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయానంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ ఫీజును(Match fee) భారత ఆర్మీకి విరాళంగా అందజేస్తానని ప్రకటించడం అభిమానులను గర్వపడేలా చేసింది.

Read Also: Telangana: హైసెక్యూరిటీ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు

పహల్గాం బాధితులకు అంకితం – ఆర్మీకి సాయం

ఇప్పటికే పాక్‌పై లీగ్ మ్యాచ్ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేసిన సూర్య, ఇప్పుడు ఆర్మీ కోసం తన సంపాదనను దానం చేయడం దేశప్రజల మనసులు గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, “ఈ ట్రోఫీ ప్రత్యేకం. కానీ నా అసలైన ట్రోఫీలు నా టీమ్‌మేట్స్ మరియు సపోర్ట్ స్టాఫ్. వారే నా బలమని” అన్నాడు.

ఫైనల్‌లో ఉత్కంఠ – గంభీర్ ఎమోషనల్

చివరి ఓవర్‌లో తిలక్ వర్మ హారిస్ రవూఫ్ బంతిని మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ బాదిన క్షణం విజయాన్ని ఖరారు చేసింది. ఈ సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ భావోద్వేగానికి లోనై ఆనందంతో డ్రెస్సింగ్ రూమ్ టేబుల్‌ను కొడుతూ కనిపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆసియాకప్‌లో భారత ఆధిపత్యం

ఇది T20 ఆసియాకప్ మూడో ఎడిషన్ కాగా, భారత్ రెండోసారి టైటిల్‌ను(title) గెలుచుకుంది. 2016లో తొలిసారిగా T20 ఫార్మాట్‌లో ట్రోఫీని కైవసం చేసుకున్న టీమ్ ఇండియా, 2025లో మరోసారి గెలిచి తన ఆధిపత్యాన్ని చాటింది. ODI మరియు T20 ఫార్మాట్లను కలిపి ఇది భారత్‌కు తొమ్మిదో ఆసియాకప్ విజయం.

Asia Cup 2025లో ఫైనల్‌లో భారత్ ఎవరిని ఓడించింది?
భారత్ పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.

సూర్యకుమార్ యాదవ్ విరాళంగా ఏం ప్రకటించాడు?
తనకు వచ్చిన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీకి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Google News in Telugu India vs Pakistan Indian Army Donation Latest News in Telugu Suryakumar Yadav Telugu News Today Tilak Varma Six

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.