📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ హర్షం

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మరొకసారి తన విజయ పతాకం ఎగురవేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) లో శనివారం రాత్రి జరిగిన ఈ కీలక పోరులో భారత్ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలోనూ, సూపర్-4లోనూ పాక్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

Asia Cup 2025: సొంత దేశ టీమ్ మేనేజ్మెంట్‌పై షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు

ఈ విజయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. టీమిండియా ఆటగాళ్ల పోరాట స్పూర్తిని కొనియాడుతూ ఆయన ట్వీట్ చేశారు. క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన కట్టుదిట్టమైన ఆట, క్రమశిక్షణ, జట్టు స్పూర్తి ఆయనను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంలో ఆయన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఆపరేషన్ తిలక్ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌లో పేర్కొన్నారు.’క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్‌దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’అని మోదీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా

ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ (Half a century) తో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు.

సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (Sanju Samson, Shivam Dubey, Tilak Verma) సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు.ఈ గెలుపుతో ఆసియా కప్‌లో టీమిండియా 9వ టైటిల్‌ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌పై ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది.

మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు

సహిబ్‌జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు.

కుల్దీప్ యాదవ్‌(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) (2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది.

తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Final Breaking News India victory latest news Modi tweet Narendra Modi reaction Operation Sindoor reference Operation Tilak mention pakistan match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.