📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: ఫైనల్ చేరిన భారత్

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 9:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్‌ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదిరిపోయే ఫామ్‌లో దూసుకెళ్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ క్రమంగా తన ప్రభావాన్ని చూపిస్తూ, క్రమశిక్షణతో కూడిన ఆటతీరు కనబరుస్తూ, ఒకటంటే ఒకటే అన్నట్టు వరుస విజయాలు అందుకుంటోంది. ఇప్పటికే సూపర్–4 దశలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా, బుధవారం జరిగిన ఐదో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి, ఓటమి రుచి చూడకుండా ఫైనల్ బరిలో అడుగుపెట్టింది.

ఈ సూపర్–4 మ్యాచ్‌లో భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు అందరూ అద్భుతంగా రాణించారు. సమష్టి కృషితోనే 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ (Bangladesh) పై ఆధిపత్యం చెలాయించగలిగారు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ల ఇన్నింగ్స్, కీలక సమయాల్లో బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతోనే విజయం సాధ్యమైంది. ఈ విజయం తర్వాత మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన అవసరమే లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్‌కి చేరుకుంది.

పాకిస్థాన్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే

మరోవైపు శ్రీలంక (Sri Lanka) అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బంగ్లాదేశ్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాకిస్థాన్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే బంగ్లాదేశ్‌కు ఫైనల్ బెర్త్‌ దక్కుతుంది. పాక్ గెలిస్తే పాక్ ఫైనల్ చేరుతుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది.

Asia Cup 2025

అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.

హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది.

అనంతరం బంగ్లాదేశ్ 127 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ సైఫ్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీ (Half a century) తో పోరాడినా ఫలితం లేకపోయింది. పర్వేజ్ హోస్సేన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), వరుణ్ చక్రవర్తీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌, తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు క్యాచ్‌లు సైఫ్ హసన్‌వే కావడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

41 run victory Asia Cup 2025 Bangladesh defeat Breaking News final berth latest news Super 4 Team India Telugu News unbeaten streak

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.