हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Asia Cup 2025: భారత్, పాక్ ఫైనల్..ఎక్కడ చూడాలంటే?

Anusha
Latest News: Asia Cup 2025: భారత్, పాక్ ఫైనల్..ఎక్కడ చూడాలంటే?

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)  టోర్నీ ఫైనల్ కు చేరుకుని, క్రీడాభిమానుల హృదయాలను ఉత్కంఠతో నింపింది. ఈ (నేడు) ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా భారత్ ,పాకిస్థాన్ తలపడనున్నారు.ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు ఎదురై ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో, ఆత్మవిశ్వాసంతో, ఆట ప్రతిభతో భారత్ ఫైనల్‌లో కొనసాగింది.

Abhishek Sharma: అభిషేక్ శర్మ సక్సెస్ సీక్రెట్ ఏదో తెలుసా?

భారత్ చేతిలో చిత్తుగా ఓడినా.. పట్టుదలతో ఆడిన పాకిస్థాన్ ఫైనల్ చేరింది. తుది పోరులో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది.అయితే ఫామ్ చూసుకున్నా.. బలబలాలు పరిశీలించినా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా‌ (Team India) కు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదు.

అలా అని పాకిస్థాన్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆటగాళ్లు (Pakistani players) కవ్వింపులకు పాల్పడటం.. భారత ఆటగాళ్లు బ్యాట్‌తో బదులివ్వడంతో వాతావరణ వేడెక్కింది. ఫైనల్లో అంతుకుమించిన డ్రామా ఉండనుంది.

Asia Cup 2025
Asia Cup 2025

ఏకపక్షంగా సాగిన ఈ టోర్నీని చాలా మంది అభిమానులు పట్టించుకోలేదు. మరికొందరు ఈ టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన సోనీ టీవీ, సోనీ లైవ్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోలేక లైట్ తీసుకున్నారు.సబ్‌స్క్రిప్షన్ (Subscription) తీసుకోవాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం

కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లను మొబైల్స్‌లో ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది. ముఖ్యం జియో యూజర్లు.. ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్‌తో సోనీ లివ్ యాప్‌ (Sony Liv App) ను ఫ్రీగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం.జియో రూ. 445 తో రిచార్జ్ చేసుకుంటే 56 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు.

అంతేకాకుండా సోనీ లివ్‌ (Sony Liv) తో పాటు జీ5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తోంది.రూ. 175 రిచార్జ్‌తో 28 రోజుల పాటు 10జీబీ డాటాతో పాటు సోనీ లివ్‌తో పాటు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.రూ. 1049 రిచార్జ్‌తో 84 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ డాటాతో పాటు సోనీ లివ్‌, జీ5, జియోటీవీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.

ఇతర నెట్‌వర్క్ యూజర్లు కూడా తమ మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్ చెక్ చేసుకొని సోనీ లీవ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఫ్రీగా ఆస్వాదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870