📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Ashes: మొదటి ఇన్నింగ్స్ లో నిప్పులు చెరిగిన స్టార్క్.. ఇంగ్లండ్ ఆలౌట్

Author Icon By Anusha
Updated: November 21, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫుల్ ఫైట్ చేస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ (Ashes) లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అద్భుతంగా ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌటైంది.

Read Also: 2026 T20 World Cup: 2026 FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. దూకుడుగా ఆడే ‘బేజ్‌బాల్’ వ్యూహాన్ని అమలు చేయాలని భావించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా పేస్ ఎటాక్ ఆదిలోనే కళ్లెం వేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో అత్యధికంగా పరుగులు చేసింది ఇద్దరే కావడం గమనార్హం.

హ్యారీ బ్రూక్ (52 పరుగులు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధసెంచరీ పూర్తి చేసి జట్టుకు కొంత ఉపశమనం అందించాడు. ఓలీ పోప్ (46 పరుగులు) కూడా బ్రూక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు గట్టి పోరాటం చేశాడు. వీరితో పాటు జెమీ స్మిత్ (33), ఓపెనర్ బెన్ డకెట్ (21) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లంతా ఆసీస్ పేస్ దాడి ముందు చేతులెత్తేశారు.

Ashes: Starc on fire in the first innings.. England all out

స్టార్క్ ఏకంగా 7 వికెట్లు తీసాడు

కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌ పతనంలో ప్రధాన పాత్ర పోషించింది ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. తన పదునైన స్వింగ్‌, వేగంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను స్టార్క్ కూల్చేశాడు.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 7 వికెట్లు పడగొట్టగా.. బ్రెండన్ డొగ్గెట్ 2 వికెట్లు, క్యామెరాన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు. స్టార్క్ ఏకంగా 7 వికెట్లు తీయడం ఆస్ట్రేలియాకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 172 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.

ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ కావడంతో, ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించి, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సంపాదించేందుకు సిద్ధమవుతోంది. యాషెస్ ఆరంభంలోనే పైచేయి సాధించిన ఆసీస్, ఇంగ్లండ్‌పై ఒత్తిడిని మరింత పెంచింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ashes 2025 Australia vs England Test England all out 172 latest news Mitchell Starc bowling Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.