Arjun Tendulkar Marriage: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో కలిసి ఆయన ఏడడుగులు వేయనున్నారు. వీరి వివాహం మార్చి 5వ తేదీన ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది.
Read Also: Dasun Shanaka: ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. కెప్టెన్ ఏమన్నారంటే?
అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు: కన్నుల పండువగా వేడుక
అర్జున్, సానియాల వివాహానికి ముందు ముకేశ్ అంబానీ దంపతులు జామ్‌నగర్‌లో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అంబానీ కుటుంబంతో టెండూల్కర్ కుటుంబానికి ఉన్న ఆత్మీయ అనుబంధంతో ఈ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి.
సచిన్ భావోద్వేగం: ‘కొడుకు పెద్దవాడయ్యాడని అర్థమైంది’
కొడుకు ఎదుగుదల గురించి సచిన్ మాట్లాడుతూ.. “ఒక కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసినప్పుడే, ఆ తండ్రికి తన కొడుకు పెద్దవాడయ్యాడని అర్థమవుతుంది. అర్జున్, సానియా ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారు. అర్జున్ తనకు నచ్చిన, తనను అంతే ప్రేమించే తోడును వెతుక్కున్నందుకు ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాకుండా, వెటర్నరీ టెక్నీషియన్‌గా కూడా అర్హత సాధించారు. ప్రస్తుతం ఆమె ‘Mr. Paws Pet Spa, Store LLP’ అనే పెట్ వెల్‌నెస్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. సానియా ప్రముఖ వ్యాపార దిగ్గజం రవి ఘాయ్ (గ్రావిస్ గ్రూప్ చైర్మన్) మనవరాలు. ఆమె తల్లిదండ్రులు సన్నీ, గౌరికా కూడా అదే సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: