BCCI news : అనురాగ్ ఠాకూర్‌కు బిగ్ రిలీఫ్, బీసీసీఐలో మళ్లీ ఎంట్రీ?

Read Time:  1 min
BCCI news
BCCI news
FONT SIZE
GET APP

BCCI news : అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ, ఇకపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)లో ఎలాంటి పదవులైనా చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 2017లో లోధా కమిటీ సిఫార్సుల అమలుపై వివాదం నేపథ్యంలో విధించిన వేటు జీవితకాల నిషేధం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పాత ఉత్తర్వులను సవరిస్తూ, ఠాకూర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆయన క్రికెట్ పరిపాలనకు దూరంగా ఉన్నారని పేర్కొంది. తాజా తీర్పుతో బీసీసీఐ వ్యవహారాల్లో తిరిగి పాల్గొనేందుకు ఆయనకు మార్గం సుగమమైంది.

Read Also: ICC T20 ranking list : ఐసీసీ ర్యాంకింగ్స్ షాక్, ఇషాన్ కిషన్ 32 స్థానాలు జంప్!

BCCI news
BCCI news

గతంలో బీసీసీఐలో సంస్కరణలు అమలు చేయడంలో నిరాకరించారనే కారణంతో ఆయనను పదవి నుంచి తొలగించారు. అయితే ఇప్పుడు కోర్టు నిర్ణయంతో మళ్లీ క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.