ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో (Team India) ఒక కొత్త వేగంతో అడుగుపెట్టింది. నాల్గవ టెస్టు మ్యాచ్ కోసం హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) ను జట్టులోకి ఎంపిక చేశారు. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాలతో జట్టుకు దూరం కావడం అన్షుల్‌కు ఈ అరుదైన అవకాశం ఇచ్చింది.ఈ వార్తను విన్న అన్షుల్ కుటుంబసభ్యులు మేఘాల మీద నడుస్తున్నట్లు ఫీలయ్యారు. అతని సోదరుడు సన్యమ్ కాంబోజ్ స్పందిస్తూ, “ఇది మా కుటుంబానికి గర్వకారణం. అన్షుల్ దేశం కోసం ఆడటం మా కల. అతను అకాడమీలో అనితరసాధ్యంగా కష్టపడ్డాడు. ఇంటికి నిద్రించడానికి తప్ప ఇంకెప్పుడూ వచ్చేవాడు కాదు,” అంటూ ఎమోషనల్ అయిపోయారు.
ఇండియా-ఏలోనే తళుకుబెత్తిన ప్రతిభ
అన్షుల్ 24 ఏళ్ల వయసులోనే తన టాలెంట్‌తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఇటీవలి ఇండియా-ఏ సిరీస్‌లో రెండు అనధికారిక టెస్టుల్లో ఆడిన అతను, నార్తాంప్టన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతేకాక, తనుష్ కోటియన్‌తో కలిసి 149 పరుగుల అజేయ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను డ్రా చేశాడు.గతేడాది కేరళపై 10 వికెట్లు తీసిన అన్షుల్, రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక్క ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇతనికి ముందు ఈ ఘనతను ప్రేమంగ్సు చటర్జీ (1956-57), ప్రదీప్ సోమసుందరం (1985-86) మాత్రమే సాధించారు.
వికటించిన పేసింగ్ టాలెంట్
రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అన్షుల్, ఎటువంటి పిచ్ అయినా బౌన్స్ తీసే నైపుణ్యంలో నిపుణుడు. అతని బౌలింగ్‌లో వేగంతోపాటు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ ఉంది. అతడి ఎంపిక జట్టుకు కొత్త ఉత్సాహం తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.అన్షుల్ కాంబోజ్ కు ఇప్పుడు అరుదైన అవకాశమొచ్చింది. అతను దాన్ని ఉపయోగించుకుని టీమ్ ఇండియాకు విజయాలను అందిస్తాడని ఆశలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు, కుటుంబ సభ్యులు, కోచ్ – అందరూ అతని విజయం కోసం ప్రార్థిస్తున్నారు.
Read Also : Hero Ajith : హీరో అజిత్ కారుకు ప్రమాదం