2025 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత పారా షూటర్ అవని లేఖరా (Avani Lekhara) మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అవని ఈ గెలుపుతో కేవలం భారతీయులకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా పారా అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Read Also: Sanju Samson: సీఎస్కేలోకి సంజూ శాంసన్?
విజయాల వెనుక కృషి
11 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో అవని లేఖరా (Avani Lekhara) తన రెండు కాళ్లను కోల్పోయారు. ఆ ప్రమాదం తర్వాత కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. మొదట ఆర్చరీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా, తర్వాత షూటింగ్ వైపు మళ్లారు. అక్కడే తన జీవితానికి కొత్త దిశను చూపించారు.
ఆమెకు కుటుంబం, కోచ్‌ల సహకారం ఎంతో కీలకం అయ్యింది.రెండు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్‌గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: