భారత క్రికెట్ జట్టు టెస్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్, దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవం, అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో ఓటమి కేవలం మామూలు ఫలితాలు మాత్రమే కావని, జట్టులో అంతర్లీనంగా ఉన్న లోతైన సమస్యలకు అద్దం పడుతున్నాయని విశ్లేషించాడు.
Read Also: Temba Bavuma: అసాధారణ ప్రదర్శనతోనే గెలిచాం: సౌతాఫ్రికా కెప్టెన్
టెస్టు క్రికెట్‌కు సరిపోయే దృక్పథాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జట్టులో సమూల మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కుంబ్లే (Anil Kumble) అభిప్రాయపడ్డాడు.గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 140 పరుగులకే ఆలౌట్ అయి, దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పరుగుల పరంగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమి.
భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచింది
అంతేకాకుండా, స్వదేశంలో ఆడిన చివరి ఏడు టెస్టుల్లో భారత్‌కు ఇది ఐదో పరాజయం. ఈ విజయంతో సౌతాఫ్రికా సుదీర్ఘకాలం తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచింది. ఈ ఫలితాలపై జియోస్టార్‌తో మాట్లాడుతూ కుంబ్లే తన విశ్లేషణను పంచుకున్నాడు. “సౌతాఫ్రికాతో ఓటమి, న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోవడం వంటివి కేవలం ఫలితాలకే పరిమితం కాదు. ఇవి జట్టులోని విస్తృత సమస్యలను సూచిస్తున్నాయి.
భారత జట్టు కొన్ని సందర్భాల్లో మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించినా, చివరికి చేతులెత్తేసింది. టెస్టు క్రికెట్‌కు భిన్నమైన ఆలోచనా విధానం అవసరం. తరచూ తుది జట్టులో మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్‌లో సర్దుబాట్లు, ఆటగాళ్ల రొటేషన్ వంటివి జట్టులో నిలకడ లేకుండా చేస్తున్నాయి. గాయాలు, ఫామ్ లేమి సహజమే అయినా, ఈ ఓటమిపై భారత్ లోతుగా సమీక్షించుకోవాలి” అని అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: