📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Anaya Bangar: తొలిసారిగా బిగ్ బాస్ హౌస్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెటిక్?

Author Icon By Anusha
Updated: August 18, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో, గుర్తుండిపోయే ఆటగాళ్లు, కోచ్‌లు ఉన్నారు. అందులో ఒకరు భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. ఆయన కూతురు అనయ బంగర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అనయ జీవితం ఒక ప్రత్యేక మలుపు తిప్పుకుంది. లింగమార్పిడి (Gender Transformation) తర్వాత ఆమె కొత్తగా తనను పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో ఆమె చేసిన ధైర్యం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.ఇటీవల వరకు క్రికెట్ ఆడిన అనయ, మహిళా క్రికెట్ జట్టులో ఆడాలని కలలు కనేది. అయితే జీవితాన్ని తన నిజమైన కోణంలో చూడాలని అనుకున్న ఆమె, లింగమార్పిడి ద్వారా తనకు తానే కొత్త అవకాశాలను సృష్టించుకుంది. ఇది సామాజికంగా పెద్ద సవాలు అయినప్పటికీ, అనయ తన ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగింది. ఈ నిర్ణయం ఆమెను మరింత బలంగా మార్చింది.

బిగ్ బాస్ 19లో ప్రత్యేక ఆకర్షణ

ఇక అనయ బంగర్ ఇప్పుడు మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 24 నుంచి ప్రారంభమయ్యే బిగ్ బాస్ 19లో ఆమె పోటీదారుగా పాల్గొననుంది. ఇది బిగ్ బాస్ హౌస్‌లో ఒక కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒక మాజీ క్రికెటర్ కూతురు, లింగమార్పిడి తర్వాత రియాలిటీ షోలో పాల్గొనడం చాలా ప్రత్యేకం. అనయ (Anaya Bangar) బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం షోకి మరింత ఆకర్షణగా నిలుస్తుందని ఇప్పటికే అంచనా వేస్తున్నారు.ETimes నివేదిక ప్రకారం.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రధాన కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్‌.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కనిపించనుంది.ఐసీసీ, బీసీసీఐకి రాసిన లేఖలో అనయ బంగర్ ఇలా అన్నారు.

Anaya Bangar

కేవలం నిజాలను చెప్పడం గురించే

“మొట్టమొదటిసారికి ట్రాన్స్ ఉమెన్ అథ్లె‌ట్‌గా మారిన నా ప్రయాణానికి సంబంధించిన శాస్త్రీయ రిపోర్టులను అందరికీ చూపిస్తున్నాను. హార్మోన్ థెరపీ ప్రారంభించిన అనంతరం నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ రిపోర్టులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. ఈ రిపోర్టును బీసీసీఐ, ఐసీసీ (ICC) కి పంపిస్తున్నాను. ఇది కేవలం నిజాలను చెప్పడం గురించే. ఎవరు అంగీకరించినా, లేకపోయానా పరవాలేదు. థాంక్యూ” అంటూ గతంలో అనయ బంగర్ చెప్పుకొచ్చింది. “సైన్స్ ప్రకారం నేను మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హురాలిని. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రపంచం ఈ నిజాన్ని వినడానికి సిద్ధంగా ఉందా?” అంటూ అనయ బంగర్ ప్రశ్నించారు.అనయ బంగర్ మొదట్లో ఆర్యన్ బంగర్ అనే పేరుతో క్రికెట్ ఆడేది. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లతో కలిసి జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొంది.

క్రికెట్ నుంచి రియాలిటీ షో వరకు

ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం తన నిజమైన గుర్తింపును వెతుక్కుంటూ లింగ మార్పిడికి సిద్ధపడింది. 2021లో అనయ బంగర్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించి అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. ఈ మార్పు ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను తీసుకొచ్చింది. ఈ ప్రయాణంలో తనకు వచ్చిన కష్టాలను సోషల్ మీడియా వేదికగా నిర్భయంగా పంచుకుంది. ఈ కఠినమైన ప్రయాణంలో ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. బిగ్ బాస్ వంటి షోలో పాల్గొనడానికి అనయ బంగర్ సరైన వ్యక్తి అని చాలా మంది భావిస్తున్నారు. ఈ షోకు కావలసిన ధైర్యం , నిర్భఊయంగా మాట్లాడే తత్వం ఆమెలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ కొత్త ఫార్మాట్‌లో అనయ ఉంటే మరింత ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

అనయ బంగర్ ఎవరు?

అనయ బంగర్ భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె.

అనయ బంగర్ కల ఏమిటి?

ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులో ఆడాలని కలలు కన్నారు.

Read more: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/akash-chopra-dhoni-will-never-be-the-head-coach-of-team-india-this-is-the-reason-says-akash-chopra/sports/531793/

anaya bangar Bigg Boss 19 gender transition Indian Cricket sanjay bangar daughter transgender contestant

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.