ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారాను మెస్సీ సందర్శించారు. అక్కడ జంతువులతో మెస్సి సరదాగా సమయాన్ని గడిపారు. వంతారాను విజిట్ చేసిన మెస్సి (Lionel Messi) కి అనంత్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన గుర్తుగా రిచర్డ్ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.
Read Also: WPL 2026 schedule : డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…
ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది
వంతారా సందర్శనకు వెళ్లేటప్పుడు మెస్సి చేతికి ఎలాంటి వాచ్ లేదు. అనంత్‌తో మీటింగ్ తర్వాత అతడి చేతిపై ఓ అరుదైన, అత్యంత ఖరీదైన గడియారం దర్శనమిచ్చింది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లె RM 003-V2 GMT (Richard Mille RM 003-V2 GMT) టూర్‌బిల్లాన్ ఆసియా ఎడిషన్. ఇలాంటివి ప్రపంచంలో కేవలం 12 పీస్‌లు మాత్రమే ఉంటాయి. దీని ధర దాదాపు 1.2 మిలియన్ డాలర్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి.
అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు అన్నమాట.ఈ గడియారాన్ని అనంత్ అంబానీ మెస్సి (Lionel Messi) కి బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక అనంత్ అంబానీ సైతం ఇలాంటి మరోవాచ్‌ను ధరించడం విశేషం. రిచర్డ్ మిల్లె RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్ అనంత్ చేతికి కనిపించింది. దీని విలువ దాదాపు దాదాపు 5 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. అంటే రూ.45.59 కోట్లన్నమాట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: