📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amitabh Bachchan: టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Amitabh Bachchan: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమ్ ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై దేశవ్యాప్తంగా ఆనందం వెల్లువెత్తుతుండగా సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ విజయంపై కొంచెం భిన్నంగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Read Also: Men’s T20 World Cup: విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా..

Amitabh Bachchan: Amitabh Bachchan’s interesting tweet on Team India’s victory

“నేను చూడలేదు కాబట్టే గెలిచారు”

నేను మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది” అని సరదాగా వ్యాఖ్యానించాడు. తాను లైవ్‌లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు అదృష్టం కలిసిరాదనే ఒక సెంటిమెంట్ తనకు ఉందని అమితాబ్ బచ్చన్ గతంలో కూడా పలుమార్లు వెల్లడించారు. అదే కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్‌ను కూడా తాను చూడలేదని ఆయన సరదాగా పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. “మీరు చేసిన త్యాగం గొప్పది సర్.. ఇకపై కూడా ఇలా మ్యాచ్ చూడకుండా ఉండండి” అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, “మేము కూడా మ్యాచ్ చూడలేదు.. అందుకే భారత్ గెలిచింది” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amitabh Bachchan Tweet India vs New Zealand T20 final India World Cup Victory 2026 Narendra Modi Stadium Ahmedabad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.