📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ambati Rayudu: కోహ్లీకి నచ్చకపోతే జట్టులో కొనసాగలేం: రాయుడు

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం అంబటి రాయుడు, విరాట్ కోహ్లీ సంబంధిత వివాదం. ఇటీవల మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీకి నచ్చకపోతే జట్టులో చోటు దక్కదు. అంబటి రాయుడే దానికి పెద్ద ఉదాహరణ” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఊతప్ప వ్యాఖ్యలు మీడియా, అభిమానుల మధ్య విపరీతంగా చర్చించబడటంతో రాయుడు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది.తాజాగా రాయుడు (Ambati Rayudu) స్పందిస్తూ, “రాబిన్ ఊతప్ప చెప్పింది కొంతవరకు నిజమే. భారత క్రికెట్‌లో ఆటగాళ్ల ఇష్టాలు, అయిష్టాలు ప్రభావం చూపే సమయాలు ఉంటాయి. కానీ అది శాశ్వతం కాదు. ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే అలాంటివి జరగవచ్చు. కానీ నా విషయంలో విరాట్ కోహ్లీకి ఎలాంటి పాత్ర లేదు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులోంచి నన్ను తప్పించడం ఒక్క కోహ్లీ నిర్ణయం కాదు. అది టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం” అని స్పష్టం చేశాడు.

జట్టు ప్రయోజనం దృష్ట్యా మేనేజ్‌మెంట్ కలిసే ఆ నిర్ణయం తీసుకుంది

అదే సమయంలో రాయుడు, “జనాలు ఎప్పుడూ ఒకే అంశాన్ని పట్టుకుని దాన్నే విస్తరించి మాట్లాడుతుంటారు. నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడని చెప్పాను. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఊతప్ప (Robin Uthappa) చెప్పిన అంశాన్నే అందరూ ఎక్కువగా చర్చిస్తున్నారు. నిజానికి నన్ను తప్పించడం వెనుక ఎవరినీ నిందించలేం. కోహ్లీ లేదా మరో వ్యక్తి కారణం కాదు. జట్టు ప్రయోజనం దృష్ట్యా మేనేజ్‌మెంట్ కలిసే ఆ నిర్ణయం తీసుకుంది” అని వివరించాడు.రాయుడు వ్యాఖ్యలు భారత క్రికెట్‌లోని వాస్తవ పరిస్థితులపై ఓ స్పష్టతనిచ్చాయి. ఎందుకంటే ఒక ఆటగాడి ఎంపిక లేదా తప్పింపు ఒకరిపై ఆధారపడదు. కోచ్, కెప్టెన్, సెలెక్టర్లు, బోర్డు – అందరి అభిప్రాయాలు కలిసే ఆఖరి జట్టు ఎంపిక జరుగుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఒక స్టార్ ఆటగాడి ప్రభావం ఉండొచ్చని ఊతప్ప చెప్పింది కూడా పూర్తిగా ఖండించలేని వాస్తవమే.

Ambati Rayudu

అన్ని పనులు చేయడం కష్టం కాబట్టి

రాబిన్ ఊతప్ప చెప్పినట్లు నాకు 2019 వన్డే ప్రపంచకప్ కోసం జెర్సీ, కిట్ అందాయి. ఎందుకంటే మెగా టోర్నీ కోసం 20-25 మంది ఆటగాళ్లను సిద్దం చేస్తారు. ఆ క్రమంలో నాకు కూడా జెర్సీ, కిట్ వచ్చాయి. ప్రపంచకప్ ప్రాబబుల్స్‌ (World Cup Probables) లో ఉన్న 25 మంది ఆటగాళ్ల వీసాలు, జెర్సీలు సిద్దం చేస్తారు. చివరి నిమిషంలో అన్ని పనులు చేయడం కష్టం కాబట్టి ముందే చేస్తారు. ఆ తర్వాతే జట్టు ఎంపిక జరుగుతుంది. నన్ను జట్టులో నుంచి తీసేయలేదు. ప్రాబబుల్స్ నుంచి పక్కనపెట్టారు.నన్ను పక్కనపెట్టినందుకు నేను బాధపడలేదు. కానీ నెంబర్ 4లో బ్యాటర్ లేకుంటే ఎలా? ఆ స్థానంలో ఆల్‌రౌండర్‌ను ఎలా ఆడిస్తారనేది నిరాశకు గురి చేసింది.

తనకు అవకాశం రాలేదని ఆరోపించాడు

నెంబర్ 4లో బ్యాటింగ్ చేసేందుకు 3 డైమెన్షనల్ ఆటగాడు ఎందుకు? టాపార్డర్, మిడిలార్డర్‌ల మధ్య వారధిగా ఉండే బ్యాటర్ అవసరం అనేదే నా బాధ. కానీ ఇది ఎవరూ అర్థం చేసుకోలేదు.’అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.2019 వన్డే ప్రపంచకప్ జట్టులో తనకు అవకాశం రాకపోవడంపై అప్పట్లో అంబటి రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే తనకు అవకాశం రాలేదని ఆరోపించాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అతను చేసిన త్రీడీ ట్వీట్ నెట్టింట తీవ్ర దుమారం రేపింది. చివరకు ప్రాబబుల్స్‌లో ఉన్న రాయుడికి ఆటగాళ్లు గాయపడినా అవకాశం దక్కలేదు.

రాయుడు ఎక్కడ జన్మించారు?

రాయుడు 23 సెప్టెంబర్ 1985న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించారు.

రాయుడు ఏ ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడారు?

ఆయన ప్రధానంగా వన్డేలు, T20 ఫార్మాట్లలో భారత్ కోసం ఆడారు. టెస్ట్ జట్టులో ఆయనకు అవకాశం రాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cricket-australia-vs-south-africa-1st-odi-live-streaming/live-news/532370/

ambati rayudu Breaking News Indian cricket controversy latest news robin uthappa team management decision Telugu News Virat Kohli world cup 2019 selection

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.