📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ambati Rayudu: ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు

Author Icon By Saritha
Updated: March 17, 2026 • 5:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ambati Rayudu: అంబటి రాయుడు తన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు. ధోనీతో తనకున్న అనుబంధం, మైదానంలో వారి మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర సంభాషణలను గుర్తు చేసుకున్నారు.

ఒక సీజన్‌లో జరిగిన ఆసక్తికర సంఘటనను రాయుడు ఈ సందర్భంగా వివరించాడు. ఐపీఎల్‌లో జట్లు క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఇచ్చే ‘ఫెయిర్ ప్లే’ (Fair Play) అవార్డు విషయంలో ధోనీ ఒకసారి రాయుడికి క్లాస్ తీసుకున్నాడట. మైదానంలో క్రమశిక్షణతో ఉండాలని, అనవసర గొడవలకు పోకూడదని ధోనీ సూచించాడు. అయితే, అదే మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితో ధోనీనే నేరుగా మైదానంలోకి వచ్చి వాదించాడని, తనకు బుద్ధి చెప్పిన కెప్టెనే ఆ రోజు తప్పు చేశాడని రాయుడు సరదాగా గుర్తు చేసుకున్నాడు.

Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

Ambati Rayudu: Ambati Rayudu Shares Old IPL Memories

ధోనీకి, తనకు మధ్య ఉన్న చనువు గురించి చెబుతూ.. ధోనీ తనను ఎప్పుడూ ‘రేకుల షెడ్డు’ అని పిలిచేవాడని రాయుడు వెల్లడించాడు. తను ఎప్పుడు ఏ విషయంలో ఆగ్రహానికి లోనవుతాడో లేదా ఎప్పుడు ఎలా స్పందిస్తాడో తెలియని తన మనస్తత్వాన్ని ఉద్దేశించి ధోనీ ఆ పేరు పెట్టాడని తెలిపాడు.

నువ్వు కేలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు. చేతులు ఊపుతూ అనవసరంగా గొడవ పడకు, మనకి ఫెయిర్ ప్లే పాయింట్స్ తగ్గుతాయి.’అని హెచ్చరించాడు. కానీ అదే ఏడాది ధోనీ.. నోబాల్ విషయంలో స్వయంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. నా వల్ల జట్టుకు నష్టం జరగలేదు.’అని అంబటి రాయుడు నవ్వుతూ చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ambati rayudu CSK Fair Play Award IPL 2026 MS Dhoni Rayudu Dhoni friendship

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.