Ambati Rayudu: అంబటి రాయుడు తన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు. ధోనీతో తనకున్న అనుబంధం, మైదానంలో వారి మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర సంభాషణలను గుర్తు చేసుకున్నారు.
ఒక సీజన్‌లో జరిగిన ఆసక్తికర సంఘటనను రాయుడు ఈ సందర్భంగా వివరించాడు. ఐపీఎల్‌లో జట్లు క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఇచ్చే ‘ఫెయిర్ ప్లే’ (Fair Play) అవార్డు విషయంలో ధోనీ ఒకసారి రాయుడికి క్లాస్ తీసుకున్నాడట. మైదానంలో క్రమశిక్షణతో ఉండాలని, అనవసర గొడవలకు పోకూడదని ధోనీ సూచించాడు. అయితే, అదే మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితో ధోనీనే నేరుగా మైదానంలోకి వచ్చి వాదించాడని, తనకు బుద్ధి చెప్పిన కెప్టెనే ఆ రోజు తప్పు చేశాడని రాయుడు సరదాగా గుర్తు చేసుకున్నాడు.
Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

ధోనీకి, తనకు మధ్య ఉన్న చనువు గురించి చెబుతూ.. ధోనీ తనను ఎప్పుడూ ‘రేకుల షెడ్డు’ అని పిలిచేవాడని రాయుడు వెల్లడించాడు. తను ఎప్పుడు ఏ విషయంలో ఆగ్రహానికి లోనవుతాడో లేదా ఎప్పుడు ఎలా స్పందిస్తాడో తెలియని తన మనస్తత్వాన్ని ఉద్దేశించి ధోనీ ఆ పేరు పెట్టాడని తెలిపాడు.
నువ్వు కేలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు. చేతులు ఊపుతూ అనవసరంగా గొడవ పడకు, మనకి ఫెయిర్ ప్లే పాయింట్స్ తగ్గుతాయి.’అని హెచ్చరించాడు. కానీ అదే ఏడాది ధోనీ.. నోబాల్ విషయంలో స్వయంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. నా వల్ల జట్టుకు నష్టం జరగలేదు.’అని అంబటి రాయుడు నవ్వుతూ చెప్పాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: