Latest news: Amanjot Kaur: నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించిన అమన్‌జోత్ కౌర్

Read Time:  1 min
Amanjot Kaur
Amanjot Kaur
FONT SIZE
GET APP

మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup 2025) ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టుకు చారిత్రక విజయం అందించిన ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur), ఇటీవల సోషల్ మీడియాలో ఆమె నానమ్మ భగవంతి కౌర్ ఆరోగ్యం బాగాలేదని, ఆమె మరణించారనే రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే, ఈ పుకార్లను అమన్‌జోత్ ఖండించారు.

Read Also: Sean Williams: రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చేరిన స్టార్ క్రికెటర్

తన నానమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ నెల 2న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, అమన్‌జోత్ తండ్రి భూపిందర్ సింగ్ (Bhupinder Singh) ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.

టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో అమన్‌జోత్ నానమ్మ భగవంతి కౌర్‌ (Bhagwanti Kaur) కు గుండెపోటు వచ్చిందని, అయితే ఆటపై ఆమె ఏకాగ్రత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయలేదని తెలిపారు.

Amanjot Kaur
Amanjot Kaur

అబ్బాయిలతో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆమెకు అండగా నిలిచింది

అమన్‌జోత్ (Amanjot Kaur) క్రికెటర్‌గా ఎదగడంలో ఆమె నానమ్మ పాత్ర ఎంతో ఉందని, చిన్నప్పుడు మొహాలీలోని వీధుల్లో అబ్బాయిలతో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆమెకు అండగా నిలిచింది నానమ్మేనని భూపిందర్ సింగ్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అమన్‌జోత్ నానమ్మ చనిపోయిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.

ఈ పుకార్లు వ్యాపించడంతో అమన్‌జోత్ (Amanjot Kaur) స్వయంగా స్పందించింది. “నా నానమ్మ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, వ్యాప్తి చేయవద్దు. నా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా 90ల కిడ్ చాలా బాగుంది” అని ఆమె ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.