📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ajit Agarkar: శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై అజిత్ అగార్కర్ వివరణ

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రకటించబడింది. మంగళవారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో సమావేశమై, 15 మంది సభ్యులతో కూడిన జట్టును తుది నిర్ణయించారు. ఈసారి జట్టులో పెద్ద ఎత్తున మార్పులు లేకుండా, ఇప్పటికే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కొనసాగించడమే సెలెక్టర్ల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.ఈ టోర్నమెంట్‌కు విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఉప సారథిగా వ్యవహరించనున్నారు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తక్కువ కాలంలోనే తన కెప్టెన్సీ నైపుణ్యాలతో అందరి మనసును గెలుచుకున్నాడు. ఇక గిల్ విషయానికి వస్తే, ఇటీవల టెస్టుల్లో చూపించిన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఆయనకు వైస్ కెప్టెన్సీగా మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టాయి.

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్

బౌలింగ్ విభాగంలో భారత ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషకర విషయం. గాయాలతో ఇబ్బంది పడ్డ తర్వాత ఆయన రీఎంట్రీ జట్టుకు బలాన్ని చేకూర్చనుంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కొనసాగుతుండగా, అక్షర్ పటేల్ (Akshar Patel) ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని దక్కించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి వేగవంతమైన బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో కీలకంగా మారే అవకాశం ఉంది.సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

అతని కోసం ఎవర్నీ తప్పించాలని ప్రశ్నించాడు

బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు చోటు దక్కగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే రీఎంట్రీ ఇచ్చాడు. అయితే టీమిండియా వెటరన్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2025లో మెరుగైన ప్రదర్శన చేసినా.. అతనికి అవకాశం ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయాన్ని అగార్కర్‌ (Ajit Agarkar) ను ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అయ్యర్‌కు భారత టీ20 జట్టులో చోటు లేదని, అతని కోసం ఎవర్నీ తప్పించాలని ప్రశ్నించాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదని, మా తప్పు కూడా లేదన్నాడు. జట్టులోకి 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలమన్నాడు. ‘శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లు తప్పని పరిస్థితుల్లో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. యశస్వి జైస్వాల్ అవకాశం కోసం వేచి చూడటం దురదృష్టకరం. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతేకాకుండా అతని వల్ల టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తోంది.

Ajit Agarkar

శ్రేయస్ అయ్యర్ తన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే

శ్రేయస్ అయ్యర్‌‌‌ పరిస్థితి కూడా దురదృష్టకరమే. శ్రేయస్ అయ్యర్ కోసం జట్టులో ఎవర్నీ తప్పించాలి? మీరే చెప్పండి? ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదు. అదే సమయంలో మా తప్పు కూడా లేదు. మేం కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలం. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ తన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే.’అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.స్టాండ్‌బై ప్లేయర్స్:ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.

అజిత్ అగార్కర్ ఎవరు?

అజిత్ అగార్కర్ భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు సేవలు అందించాడు. ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

అజిత్ అగార్కర్ ఏ రాష్ట్రానికి చెందినవారు?

అజిత్ అగార్కర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైకి చెందినవారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/live-cricket-score-australia-vs-south-africa-1st-odi/international/532693/

Ajit Agarkar chief selector Breaking News India Asia Cup 2025 team Jasprit Bumrah comeback latest news shubman gill vice captain Surya Kumar Yadav captain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.