हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Ajinkya Rahane: సెలెక్షన్ కమిటీ పై అజింక్యా రహానే ఆగ్రహం

Aanusha
Latest News: Ajinkya Rahane: సెలెక్షన్ కమిటీ పై అజింక్యా రహానే ఆగ్రహం

టీమిండియా మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (Ajinkya Rahane) దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ తన సత్తా చాటుతున్నప్పటికీ, సెలెక్షన్‌ కమిటీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌ (Ranji match) లో రహానే అద్భుతమైన 159 పరుగులు చేసి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆస్ట్రేలియా‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన అవసరం కనిపించిందన్నాడు.

Read Also: Pratika Rawal: గాయంతో సెమిఫైనల్స్‌కి దూరమైన ప్రతికా

సెలెక్టర్లు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు

ఈ సిరీస్‌లో తాను ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ‘వయసు కేవలం అంకె మాత్రమే. అనుభవం కలిగిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలి. వయసు ఏ మాత్రం ముఖ్యం కాదు. ఆడాలన్న ఇంటెంట్ ముఖ్యం. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 (Border Gavaskar Trophy 2024-25) లో నా అవసరం కనిపించింది.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ సెలెక్టర్లు నా వయసునే పరిగణలోకి తీసుకొని పక్కనపెట్టారు.ఆస్ట్రేలియా ప్లేయర్ మైకేల్ హసీ (Michael Hussey)30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అనుభవం చాలా ముఖ్యం. అందుకే ఆస్ట్రేలియాలో నా అవసరం ఉంటుందని భావించా. నాలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు పునరాగమనం చేసినప్పుడు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.

 Ajinkya Rahane
Ajinkya Rahane

పరుగులు, ప్రదర్శనలను పక్కనపెడితే

జట్టులో నుంచి తప్పించేటప్పుడు కూడా సెలెక్టర్లు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గత నాలుగైదేళ్లుగా దేశవాళీలో ఆడుతున్నా. నిలకడగా రాణిస్తున్నా. పరుగులు, ప్రదర్శనలను పక్కనపెడితే ఆటపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.’అని 37 ఏళ్ల రహానే చెప్పుకొచ్చాడు.రహానే చివరిగా 2023 జూలైలో వెస్టిండీస్‌పై ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రహానేతో పాటు చతేశ్వర్ పుజారాను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870