📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ajinkya Rahane: నాకు టెస్ట్ క్రికెట్ చాలా ఇష్టం: రహానే

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే మళ్లీ భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రహానే తన భావోద్వేగాలను బయటపెట్టాడు. తాను తిరిగి టెస్ట్ క్రికెట్ (Test cricket) ఆడాలనే కోరికను ఇప్పటికే సెలక్షన్ కమిటీకి తెలియజేశానని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పాడు. అయినప్పటికీ తాను ఆశను వదలకుండా, ప్రతి రోజూ కష్టపడుతూ ముందుకు సాగుతున్నానని అన్నాడు.37 ఏళ్ల రహానే ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత జట్టు నుంచి తొలగించబడిన అజింక్య రహానే, మళ్లీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందు కోసం ముంబై జట్టులో చేరి దేశీయ మ్యాచ్‌లపై దృష్టి సారించాడు.ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లార్డ్స్ మైదానంలో ఉన్న అజింక్య రహానే స్కై స్పోర్ట్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను.

విరాట్ కోహ్లీ లేని సమయంలో

టెస్ట్ క్రికెట్ పట్ల నాకు చాలా ఆసక్తి ఉంది. నేను నియంత్రించగలిగే విషయాలపై దృష్టి సారించడమే నా పని. నిజం చెప్పాలంటే, భారత జట్టు సెలక్షన్ కమిటీతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఎటువంటి స్పందన రాలేదు. నేను నిరంతరం ఆడగలను. నాకు టెస్ట్ క్రికెట్ ఇష్టం.” అని అజింక్యా రహానే (Ajinkya Rahane) ఆవేదనతో తెలియజేశాడు.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రహానే జట్టులోకి తిరిగి రావడానికి ఒక చిన్న అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ, ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, భారత సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. 2020-21 బోర్డర్-గవాస్కరీ ట్రోఫీలో రహానే కెప్టెన్సీ మర్చిపోలేనిది. విరాట్ కోహ్లీ (Virat Kohli) లేని సమయంలో భారత జట్టును నడిపించి మెల్బోర్న్, గాబా టెస్ట్ మ్యాచ్‌లలో చారిత్రాత్మక విజయాలను అందించారు.

Ajinkya Rahane: నాకు టెస్ట్ క్రికెట్ చాలా ఇష్టం: రహానే

ట్రోఫీలో కప్‌

ఆ సిరీస్‌లో 268 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.2013లో అరంగేట్రం చేసిన రహానే, ఇప్పటివరకు 85 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడి 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 5077 పరుగులు సాధించాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే 11 ఇన్నింగ్స్‌లలో 214 పరుగులు చేశాడు. అజింక్యా రహానే నాయకత్వంలోని ముంబై జట్టు, 2023-24 రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో కప్‌ను గెలుచుకుంది.తన ఫిట్‌నెస్, కట్టుదిట్టమైన బాటింగ్‌తో మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నాడు.అతని ప్రకటనపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఒక సీనియర్ ఆటగాడిగా, విశాల అనుభవం కలిగిన ప్లేయర్‌గాను, రహానేకు జట్టులో చోటు కల్పించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అజింక్య రహానే ఎక్కడ జన్మించాడు?

అజింక్య రహానే 1988 జూన్ 6న మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లా, సంగమ్నేర్ తాలూకాలోని అశ్వి కే.డి. గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పేరు మధుకర్ బాబురావు రహానే, తల్లి పేరు సుజాత రహానే. అతనికి శశాంక్ అనే తమ్ముడు, అపూర్వ అనే చెల్లెలు ఉన్నారు.

అజింక్య రహానే ఆస్తి విలువ ఎంత?

2025 నాటికి అజింక్య రహానే అంచనా నికర ఆస్తి సుమారు ₹80 కోట్ల రూపాయలు (అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు $10 మిలియన్) గా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి రాధిక హత్య..స్పందించిన స్నేహితురాలు హిమాన్షిక

Ajinkya Rahane Breaking News India Test Team Rahane comeback Rahane Interview Team India Selection Telugu News Test Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.