📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇబ్రహీం జద్రాన్ రికార్డ్

Author Icon By Anusha
Updated: February 27, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌, ఆతిథ్య‌మిస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో వ‌రుస‌గా సెంచ‌రీలు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పాకిస్థాన్ జ‌ట్టు మిన‌హాయిస్తే మిగ‌తా ఏడు జ‌ట్ల త‌ర‌ఫున ప‌లువురు ఆట‌గాళ్లు శ‌త‌కాలు బాదారు. నిన్న‌టి ఇంగ్లండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ మ్యాచ్‌లో రెండు సెంచ‌రీలు వ‌చ్చాయి.చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. పటిష్ఠమైన ఇంగ్లండ్ జట్టుపై భారీ స్కోరు నమోదు చేయడంతో పాటు, 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచింది. ముఖ్యంగా ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో రికార్డులు బద్దలుకొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (177) సాధించి,ఆ త‌ర్వాత ఛేద‌న‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ జో రూట్ కూడా సెంచ‌రీ (120) న‌మోదు చేశాడు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సీజ‌న్‌లో 11 సెంచ‌రీలు న‌మోద‌య్యాయి. ఇంకా నాకౌట్ ద‌శలో కొన్ని మ్యాచ్‌ల‌తో పాటు సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్ ఉండ‌డంతో ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాల రికార్డులను అధిగమించాడు.

ఇన్నింగ్స్

లాహోర్‌లోని గదాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత 37 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్థాన్‌ను జద్రాన్ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి చాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా జద్రాన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 165 పరుగులతో బెన్ డకెట్ (ఆస్ట్రేలియా పై) పేరిట ఉండగా, ఇప్పుడు జద్రాన్ ఆ రికార్డును తిరగరాశాడు.

ఆఫ్ఘనిస్థాన్ విజయం

ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది.తొలుత 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన ఆఫ్ఘనిస్థాన్‌ను జద్రాన్ ఆదుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్ జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది.కెప్టెన్ హష్మతుల్లా (40)తో కలిసి నాలుగో వికెట్‌కు సెంచరీ (103) భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆ తర్వాత మహ్మద్ నబీ (40)తో కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు. ఇక, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న జద్రాన్ 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి చాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  

అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్థాన్) – 177 పరుగులు

(2025)బెన్ డకెట్ (ఇంగ్లండ్) – 165 పరుగులు

(లాహోర్)నాథన్ ఆస్ట్లే (145*) – 2004

ఆండీ ఫ్లవర్ (145) – 2002

సౌరవ్ గంగూలీ (141*) – 2000

సచిన్ టెండూల్కర్ (141) – 1998

గ్రేమ్ స్మిత్ (141) – 2009

#AfghanistanCricket #ChampionsTrophy #CricketRecords #IbrahimZadran Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.