Latest News: Actress Pragati: ఏషియన్ గేమ్స్​లో సత్తా చాటిన నటి ప్రగతి

Read Time:  1 min
Latest News: Actress Pragati: ఏషియన్ గేమ్స్​లో సత్తా చాటిన నటి ప్రగతి
FONT SIZE
GET APP

నటి ప్రగతి (Actress Pragati) గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమె తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. అయితే ఆమె ఓ వైపు యాక్టింగ్ చేస్తూనే, మరోవైపు క్రీడా రంగంలోనూ రాణించారు.పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న ఆమె తాజాగా ఇంటర్నేషనల్ పోడియంపై విజేతగా నిలిచారు. ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు.

Read Also: Mani Ratnam: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి – సాయిపల్లవి?

ఒకేసారి 4 మెడల్స్‌

టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌-2025లో పాల్గొన్న ప్రగతి.. ఇండియా తరపున ఏకంగా నాలుగు మెడల్స్ సాధించారు. ఈ విషయాన్ని ప్రగతి (Actress Pragati) ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టారు. డెడ్‌ లిఫ్ట్‌లో గోల్డ్‌ మెడల్‌.. బెంచ్‌, స్క్వాడ్‌ లిఫ్టింగ్‌లో రెండు సిల్వర్‌ మెడల్స్‌ గెలుచుకున్నారు.

ఓవరాల్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించినట్లు ప్రగతి తెలిపారు. ప్రగతి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.