📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Abhishek’s sister Komal Sharma:యువరాజ్ సింగ్ గైడెన్స్ తో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 7:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025(Asia Cup 2025)లో టీమిండియా ప్రదర్శన అభిమానులను ఉల్లాసపరుస్తోంది. సూపర్-4 దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ సమష్టిగా ప్రదర్శనతో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం యువ సంచలనం అభిషేక్ శర్మ  (Abhishek Sharma)యొక్క మెరుపు ఇన్నింగ్స్. కేవలం 39 బంతుల్లో 75 రన్స్ సాధిస్తూ, భారత్ ఫైనల్‌కు చేరుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

అయితే రనౌట్ రూపంలో అభిషేక్ శర్మ సెంచరీని కోల్పోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే అభిషేక్ శర్మ సెంచరీని మిస్సయినా.. అతని ప్రదర్శనపై సోదరి కోమల్ శర్మ వ్యక్తం చేసిన భావోద్వేగాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. “నిజాయితీగా చెప్పాలంటే క్రికెట్‌లో రనౌట్ అవ్వడం కొంచెం బాధ కలిగించింది. అయినప్పటికీ ఆ సెంచరీ లోడవుతోంది.

 Abhishek Sharma: నేను ఓ ఫ్లో ప్రకారం ఆడుతా: అభిషేక్ శర్మ

యువరాజ్ సింగ్ గైడెన్స్ ఎంతో ఉందని

త్వరలోనే అభిషేక్ సెంచరీ చేస్తాడు” అని కోమల్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.కోమల్ శర్మ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన వెనుక అతని మెంటార్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)గైడెన్స్ ఎంతో ఉందని వెల్లడించారు. “యువరాజ్ సార్ చెప్పిన సూచనలను అభిషేక్ పాటిస్తాడు. మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత ఎలా ఆడాలో, ఏం చేయాలో అనే అన్నివిషయాలను యువరాజ్ ఎల్లప్పుడూ అభిషేక్‌కు తెలియజేస్తుంటారు” అని అభిషేక్ అక్క కోమల్ శర్మ అన్నారు.

అలాగే అభిషేక్ శర్మ తన తల్లిని అదృష్ట దేవతగా భావిస్తాడని కోమల్ శర్మ (Komal Sharma)పేర్కొన్నారు. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ” మొత్తం జట్టు బాగా ఆడుతోంది. చివరికి మాకు ట్రోఫీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. టీమిండియా (Team India)సభ్యులందరూ అత్యుత్తమంగా రాణించి టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తున్నాం” అని కోమల్ శర్మ అన్నారు.బంగ్లాదేశ్‌పై 75 పరుగుల ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు.

Abhishek’s sister Komal Sharma

అభిషేక్ ఆరు సార్లు ఈ ఘనత

టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాళ్లలో అభిషేక్ ఆరు సార్లు ఈ ఘనత సాధించి తన మెంటార్ యువరాజ్ సింగ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(13), సూర్యకుమార్ యాదవ్(9) మాత్రమే ముందున్నారు. ఈ ఆసియా కప్ 2025 ఎడిషన్‌లో ఏకంగా 17 సిక్స్‌లు కొట్టి, ఒకే టోర్నమెంట్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన ఆటగాడిగా కొత్త ఆసియా కప్ రికార్డును నెలకొల్పాడు.

బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ, అభిషేక్ శర్మ (75), శుభ్‌మన్ గిల్ (29) టీమిండియాకు పవర్ ప్లే (Power play) లోనే 72 పరుగులు అందించి శుభారంభం ఇచ్చారు. అయితే అభిషేక్ రనౌట్ తర్వాత మిడిల్ ఆర్డర్ త్వరగా ఔట్ కావడంతో ఇన్నింగ్స్ వేగం తగ్గింది.

ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు

హార్దిక్ పాండ్యా (38), అక్షర్ పటేల్ (నాటౌట్ 10) సహకారంతో భారత్ 168/6 పరుగులు చేయగలిగింది.లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్ సైఫ్ హసన్ (69) భారత ఫీల్డర్ల దయతో ఏకంగా 4 లైఫ్‌లైన్స్ అందుకుని పోరాడినా, భారత స్పిన్నర్లు విజయం సాధించారు.

ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (3-18), వరుణ్ చక్రవర్తి (2-29) మధ్య ఓవర్లలో పట్టు బిగించడంతో బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకోగా, మరో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నేడు పోటీపడనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

abhishek sharma Breaking News Cricket Training Komal Sharma latest news Match Strategy Mentor Guidance Mother as Lucky Charm Player Development Telugu News Yuvraj Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.