📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభిషేక్ శర్మ ప్రదర్శన పట్ల అందరి ప్రశంసలు

Author Icon By Divya Vani M
Updated: January 23, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో భారత జట్టు తన శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించి ఘనవిజయం సాధించింది.ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఆటతో అబ్బురపరిచాడు.అతను కేవలం 34 బంతుల్లోనే 79 పరుగులు చేస్తూ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశాడు.ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు న‌మోదు కావడం విశేషం.

ముఖ్యంగా, అభిషేక్ తన హాఫ్ సెంచరీని కేవలం 20 బంతుల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్,ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా అర్ధ శతకం నమోదు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడు 2007 టీ20 ప్రపంచ కప్‌లో కేవలం 12 బంతుల్లో అర్ధ శతకం చేసిన యువరాజ్ సింగ్.

విశేషంగా, యువరాజ్ ప్రస్తుతం అభిషేక్‌కు మెంటార్‌గా ఉన్నారు.అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు (8) కొట్టిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.అభిషేక్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌ను గ‌తేడాది జింబాబ్వేపై మ్యాచ్‌లో ప్రారంభించాడు.తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.అయితే, ఆ తర్వాత అతని ప్రదర్శన అంతగా మెప్పించలేదు.కానీ,ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు అభిషేక్ 13 టీ20 మ్యాచ్‌ల్లో 27.91 సగటు, 183.06 స్ట్రైక్ రేట్‌తో 335 పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో అభిషేక్ ప్రదర్శనపై ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యువరాజ్ లాంటి మెంటార్ తోడవడంతో అతని ఆటలో మరింత మెరుగుదల కనిపిస్తోంది.

Abhishek Sharma Records Abhishek Sharma T20 Performance Eden Gardens T20 Match Fastest Fifty in T20 India vs England T20 Series Team India Victory

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.