ఆసియా కప్ 2025 (2025 Asia Cup) టోర్నీలో భాగంగా జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్,పాకిస్తాన్ జట్లు ఎదుర్కొన్న సందర్భం క్రికెట్ అభిమానుల కోసం నిజంగా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన బ్యాటింగ్‌తో అభిమానులను, ప్రత్యేకంగా తన కుటుంబాన్ని కట్టిపడేసాడు.సూపర్ 4 మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ను ఆస్వాదించామని బ్యాటర్ తల్లి మంజు శర్మ పేర్కొన్నారు.
తొలి బంతినే అభిషేక్ సిక్స్ గా మలచడం మరిచిపోలేమని అన్నారు. ఈ మ్యాచ్ లో అభి సెంచరీ చేస్తాడని భావించానని ఆమె తెలిపారు. దుబాయ్ (Dubai) లో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించిన మంజు శర్మ, అభిషేక్ సోదరి కోమలి శర్మ అనంతరం మీడియాతో మాట్లాడారు. అభి సెంచరీ చేజార్చుకోవడం కాస్త నిరాశ కలిగించిందని మంజు శర్మ చెప్పారు.
పాకిస్థాన్ పై అభిషేక్ ఇన్నింగ్స్
అయితే, ఈ టోర్నమెంట్ (Tournament) లో అభి సెంచరీ చేస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.అభిమానుల మద్దతు ఇలాగే కొనసాగితే దేశం కోసం అభిషేక్ మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పారు. అభిషేక్ శర్మ తండ్రి కోమల్ శర్మ (Komal Sharma) మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన ప్రతీ మ్యాచ్ చూడాలని తాను అనుకుంటానని చెప్పారు.
పాకిస్థాన్ పై అభిషేక్ ఇన్నింగ్స్ చూశాక చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభి అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్ అని, అతడికి ఆకాశమే హద్దని చెప్పారు. ఈ టోర్నీలో అభి సెంచరీ చూడాలని ఎదురుచూస్తున్నట్లు కోమల్ శర్మ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: