టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తెలుగు అభిమానులకు సుపరిచితమే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే, తాజాగా తన ఫేవరేట్ టాలీవుడ్ హీరోని వెల్లడించాడు. ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు.
Read Also: Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్
ఆయన క్రేజ్ గురించి తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటా
ఖాళీ సమయాల్లో మహేష్ సినిమాలు చూస్తానని, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ గురించి తెలుగు సహచర ఆటగాళ్లతో చర్చిస్తుంటానని తెలిపాడు. క్రికెట్‌తో పాటు సినిమాలపై కూడా తనకు మంచి అవగాహన ఉందని ఈ మాటలతోనే అర్థమవుతోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనకు పిచ్చెక్కించిందని తెలిపాడు.ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. తొలి టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్.. రెండో టీ20లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. నాలుగో టీ20లో మరోసారి అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: