టీమిండియాను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 లో, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, వరుసగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరం కారణంగా అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమవ్వగా, ఇప్పుడు అదే దారిలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేరిపోయాడు. మ్యాచ్ మధ్యలోనే అభిషేక్ (Abhishek Sharma) అస్వస్థతకు గురికావడం అభిమానులను కలవరపెట్టింది.
Read Also: Boxum Elite International Tournament: బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు
కొంచెం నిరాశ
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో మైదానం వీడారు. ఆయన స్థానంలో సంజు శాంసన్ ఫీల్డింగ్ చేశారు. మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ, అభిషేక్ కోలుకుంటున్నారని, ఈ నెల 12న నమీబియాతో జరిగే మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో అభిషేక్ (Abhishek Sharma) తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యారు. ఇప్పటికే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో, బుమ్రా జ్వరంతో బాధపడుతున్నారు.
కీలక ఆటగాళ్లు త్వరగా కోలుకోవడం టీమిండియాకు అత్యవసరం.అభిషేక్ శర్మకు ఈ వరల్డ్ కప్ ఆరంభం అంత గొప్పగా లేదు. అమెరికాపై జరిగిన తన తొలి సీనియర్ ఐసీసీ మ్యాచ్‌లో కేవలం ఒక్క బంతి ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి తోడు అనారోగ్యం కూడా చుట్టుముట్టడంతో ఆయన కొంచెం నిరాశలో ఉన్నారు. అయితే, నమీబియాతో జరగబోయే మ్యాచ్ లో తన బ్యాట్‌తో సమాధానం చెప్పాలని అభిషేక్ కసితో ఉన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: