ఆసియా కప్ 2025(2025 Asia Cup)లో టీమిండియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. సూపర్-4 దశలో జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో గెలిచింది.. పాక్ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించగలిగింది. ఈ విజయానికి బ్యాటింగ్‌లో ప్రత్యేకంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (Abhishek Sharma, Shubman Gill) మంచి ఓపెనింగ్ ఇచ్చారు.వారు మొదటి ఇన్నింగ్స్‌లోనే పాక్ బౌలర్లపై ఆధిపత్యం చూపారు.
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో అత్యంత ఆకట్టుకునే ప్రదర్శనను కనబరచాడు. తన ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లను ఎదుర్కొని, టీ20 (T20) లో తక్కువ బంతుల్లో 50 సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించడంలో అతను కేవలం 331 బంతులలోనే 50 సిక్సుల మైలురాయిని దాటాడు. ఇది ప్రపంచ క్రికెట్‌లోని కొత్త రికార్డు.
ఈ ఫీట్‌కు ముందు, ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఈవిన్ లూయిస్ పేరు మీద నమోదై ఉండేది.. అతడు 366 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మూడో స్థానంలో అడ్రే రస్సెల్ (Audrey Russell) ఉండగా, హజ్రతుల్లా జాజై (అఫ్గానిస్థాన్), టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 350 బంతుల్లో 50 సిక్సులు కొట్టిన వారి జాబితాలో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 రన్స్ చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సొతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో రెండుసార్లు తొలి బంతికే సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: