Dhoni-AB de Villiers: ధోనీకి డివిలియర్స్ కీలక సూచన

Read Time:  1 min
Dhoni-AB de Villiers: ధోనీకి డివిలియర్స్ కీలక సూచన
FONT SIZE
GET APP

Dhoni-AB de Villiers: ఐపీఎల్ 2026లో పసుపు చొక్కా ధరించి బరిలోకి దిగనున్న మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆట కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, గత సీజన్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా కిందకు వచ్చి కేవలం కొన్ని బంతులు మాత్రమే ఎదుర్కోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ సీఎస్‌కే యాజమాన్యానికి ఒక కీలక సలహా ఇచ్చారు.

Read Also: IPL 2026: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్

AB de Villiers key advice to Dhoni
AB de Villiers key advice to Dhoni

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అవసరం

గత సీజన్‌లో ధోనీ ఎక్కువగా 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు.అయితే ఈసారి మాత్రం ధోనీ అలా చేయొద్దని.. దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సీఎస్కేకు సూచిస్తున్నాడు. ధోని బ్రాండ్‌ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇచ్చి ముందుకు పంపితేనే సీఎస్కేకు ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చాడు.

“చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే గత కొన్ని సీజన్‌లుగా ధోనీ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించట్లేదు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడంతో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. నిజానికి మహీ.. 8, 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అతడు.. కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా రావాలి. నా అభిప్రాయం ప్రకారం ధోనీ.. నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఉత్తమం. ఆరో స్థానం కంటే లేటుగా అతడు బ్యాటింగ్‌కు వస్తే.. తుది జట్టులో ఉండి కూడా పెద్దగా లాభం ఉండదు” అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.