AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

Read Time:  1 min
AB de Villiers
AB de Villiers
FONT SIZE
GET APP

AB de Villiers: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే ప్రశ్నకు దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అనూహ్యమైన సమాధానం ఇచ్చాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్‌గా ఆయన అభివర్ణించాడు. సాధారణంగా కోహ్లీ, గేల్ వంటి దిగ్గజ బ్యాటర్ల పేర్లు వినిపిస్తాయని ఆశించిన అభిమానులకు, డివిలియర్స్ ఒక బౌలర్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొత్త బంతి, పాత బంతి లేదా ఉత్కంఠభరితమైన సూపర్ ఓవర్.. ఇలా ఏ పరిస్థితిలోనైనా బుమ్రా బంతితో మ్యాజిక్ చేసి గెలిపిస్తాడని డివిలియర్స్ ప్రశంసించాడు. అయితే, “తనకు బౌలింగ్ చేయనంత వరకే బుమ్రా గొప్ప బౌలర్” అంటూ ఏబీడీ తనదైన శైలిలో చమత్కరించాడు.

Read Also:Bangladesh Cricket :బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం: ప్రభుత్వం వర్సెస్ బీసీబీ!

AB de Villiers
AB de Villiers: Bumrah is the greatest player in T20 history!

బుమ్రా గణాంకాలు కూడా ఆయన ప్రతిభకు అద్దం పడుతున్నాయి. 2013లో టీ20ల్లోకి అడుగుపెట్టిన బుమ్రా, ఇప్పటివరకు 270 మ్యాచ్‌లలో 345 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 95 మ్యాచ్‌లలో 121 వికెట్లు తీసి, దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ 145 మ్యాచ్‌లలో 183 వికెట్లు సాధించాడు. ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

మరోవైపు, పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బుమ్రా విలక్షణమైన బౌలింగ్ శైలిని ఉద్దేశిస్తూ.. అతడిని మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చాడు. “ఫాస్ట్ బౌలింగ్‌లో బుమ్రా ఒక ఉస్మాన్ తారిఖ్ లాంటివాడు” అని జావేద్ వ్యాఖ్యానించడంపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచ నంబర్ వన్ పేసర్‌ను ఒక సాధారణ స్పిన్నర్‌తో పోల్చడం తగదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.