Latest News: Ruturaj Gaikwad: రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతు

Read Time:  1 min
Latest News: Ruturaj Gaikwad: రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతు
FONT SIZE
GET APP

రాంచీలో జరిగిన వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగో స్థానంలో ఆడేందుకు వచ్చిన అతను 14 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు.16 నెలల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతుగా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపడాన్ని తప్పుబట్టాడు.

Read Also: Gautam Gambhir: రోహిత్, గంభీర్ మధ్య లాంగ్ డిస్కషన్

ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అని గుర్తించి

రుతురాజ్ (Ruturaj Gaikwad) టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అని గుర్తు చేసిన ఆకాశ్ చోప్రా (Akash Chopra), నాలుగో స్థానంలో పంపించడంపై జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నించాడు.రుతురాజ్ ఇంతవరకు ఎప్పుడూ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయలేదని అన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో క్రీజు వదలాల్సి వచ్చిందని, కానీ ఈ ప్రదర్శనను చూసి అతనిపై అప్పుడే ఒక అంచనాకు రావొద్దని సూచించాడు.

Aakash Chopra supports Ruturaj
Aakash Chopra supports Ruturaj

నాలుగో స్థానంలో విఫలమైన అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. అతను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అని గుర్తించి అవకాశం ఇవ్వాలని అన్నాడు. అతనిని వెంటనే జట్టులో నుంచి తొలగించవద్దని సూచించాడు. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన తర్వాత అతడి కెరీర్‌పై ఓ నిర్ణయం తీసుకోవాలని హితవు పలికాడు.

IPLలో రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాడు?

IPLలో రుతురాజ్ గైక్వాడ్ 2019లో Chennai Super Kings ద్వారా ఎంపికయ్యాడు. అయితే మొదటి మ్యాచ్‌ను 2020లో ఆడాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.