మధ్య ప్రదేశ్‌లోని, ఓ బాలుడు ఫోన్‌కు విపరీతంగా అలవాటు పడ్డాడు. ఇది చాలా ప్రమాదకరం అని తెలుసుకున్న అమ్మానాన్నలు.. మూడేళ్ల కుమారుడి చేత ఎలాగైనా ఫోన్ మాన్పించాలనుకున్నారు. అందుకోసం అతడి దృష్టి మళ్లించేలా గేమ్స్ నేర్పించారు. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చుని చెస్ (Chess) నేర్పించారు. అతి తక్కువ కాలంలోనే అతడు మంచి ప్రతిభను కనబర్చగా కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు.
Read Also: IND vs SA 2nd ODI: రెండవ వన్డే.. టాస్ ఓడిన భారత్

ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు
అక్కడ విపరీతమైన మెలుకువలు నేర్చుకున్న ఆ బుడ్డోడు.. ఇప్పుడు, సర్వజ్ఞసింగ్ కుశ్వాహా (Sarvajna Singh Kushwaha) ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు.
స్మార్ట్‌ఫోన్ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశంతో చెస్ (Chess) నేర్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఈ రికార్డు WBకు చెందిన అనీశ్ సర్కార్ (3సం.8నెలలు) పేరిట ఉండేది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: