📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vaibhav Suryavanshi: వైభవ్ కు అరుదైన ఘనత

Author Icon By Anusha
Updated: December 26, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో 14 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ యువ సంచలనం, ఇప్పుడు చిన్నారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకోనున్నాడు. ఢిల్లీలో ఈరోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ (Vaibhav Suryavanshi) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించనున్నాడు.

Read Also: IND W VS SL W: తిరువనంతపురంలో నేడు 3వ T20

ప్రధానమంత్రి మోదీతో భేటీ

ఈ కార్యక్రమం కోసం బుధవారమే ఢిల్లీకి చేరుకున్న వైభవ్, అవార్డు ప్రదానోత్సవం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నాడు. క్రీడలు, ఇతర రంగాల్లో రాణిస్తున్న యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

A rare achievement for Vaibhav

అతని అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. అయితే, ఈ అవార్డు వేడుక కారణంగా అతను విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.సాధారణంగా 5 నుంచి 18 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులు ధైర్యసాహసాలు, కళలు, సైన్స్, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందిస్తారు. చిన్న వయసులోనే బిహార్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన వైభవ్ ప్రయాణం దేశంలోని ఎంతో మంది వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Pradhan Mantri Rashtriya Bal Puraskar Telugu News Vaibhav Suryavanshi young cricketer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.