हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: 2nd ODI: రాయ్‌పూర్ క్రికెట్ సఫారీ సందడి

Radha
Latest News: 2nd ODI: రాయ్‌పూర్ క్రికెట్ సఫారీ సందడి

2nd ODI: రాయ్‌పూర్‌లోని(Raipur) షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే నిజంగా క్రికెట్ ప్రేమికులను ఉత్కంఠలో పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 358 పరుగులతో భారీ స్కోరు ఖాతాలో వేసింది. రోహిత్, జైస్వాల్ మంచి ఆరంభం ఇచ్చిన తర్వాత అసలు విజృంభణను చూపింది మధ్యవరుసే. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) ఇద్దరూ అద్భుత శతకాలు నమోదు చేస్తూ భారత ఇన్నింగ్స్‌కు బలాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం సాధించి సౌతాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ముగింపులో కేఎల్ రాహుల్ (66), జడేజా (24) వేగంగా రన్స్ రాబట్టడంతో భారత్ 358/5తో ఇన్నింగ్స్ ముగించింది. సౌతాఫ్రికా తరపున మార్కో జాన్సెన్ మాత్రమే రెండు వికెట్లు తీసి కొంత మెరుగైన ప్రదర్శన చేశాడు.

Read also:  GHMC Expansion: హైదరాబాద్ నగర అంచులు మరింత ముందుకు

2nd ODI

సౌతాఫ్రికా చరిత్రాత్మక ఛేదన

2nd ODI: 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటం సులభం కాదు. కానీ సఫారీ బ్యాటర్లు అద్భుతమైన సంయమనంతో, ప్రెజర్‌ను పట్టించుకోకుండా భారీ ఛేజ్‌ను విజయవంతం చేశారు.
డీకాక్ తొందరగా వెనుదిరిగినప్పటికీ, మార్క్రమ్–బావుమా జోడీ 101 పరుగులు జోడిస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. మార్క్రమ్ తన అద్భుతమైన టచ్లో 98 బంతుల్లో 110 పరుగులు చేసి మ్యాచ్‌ను సౌతాఫ్రికా వైపు మళ్లించాడు. అతని శతకం కీలక మలుపుగా మారింది. మార్క్రమ్ ఔటైన తర్వాత కూడా బ్రీట్జ్‌కే (68), యువ హిట్టర్ బ్రెవిస్ (54) ఇద్దరూ ధైర్యంగా ఆడారు. ముఖ్యంగా బ్రెవిస్ 5 సిక్స్‌లతో భారత బౌలర్లపై విరుచుకుపడాడు. చివరి ఓవర్లలో చిన్న భాగస్వామ్యాలు కూడా బాగానే క్లిక్ కావడంతో సఫారీలు లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చారిత్రక విజయం నమోదు చేశారు.

సిరీస్ సమం—విశాఖపై దృష్టి

ఈ విజయంతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఇప్పుడు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది. రెండు జట్లూ సమాన శక్తితో నిలిచిన నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

రెండో వన్డేలో భారత్ ఎంత స్కోరు చేసింది?
358/5 పరుగులు.

సౌతాఫ్రికా తరఫున ప్రధాన పాత్ర పోషించిన ఆటగాడు ఎవరు?
ఎయిడెన్ మార్క్రమ్ – 110 పరుగులు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870