భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆసక్తికరంగా ముగిసింది.ఆతిథ్య ఆస్ట్రేలియా 3-1 తేడాతో ఈ సిరీస్‌ను గెలుచుకుంది. అయితే, ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాలోని చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. దీనితో ప్రతి టెస్ట్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.కొందరు కొత్తగా అరంగేట్రం చేస్తే, మరికొందరు సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేశారు.అయితే, జట్టులో భాగంగా ఉన్నప్పటికీ ఒక టెస్టు మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ముగ్గురు ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, తనుష్ కోటియన్.ఈ ముగ్గురికి ఆడే అవకాశం రాకపోయినా వారి త్రెషరీ ఖాతా మాత్రం ఖాళీ కాలేదు.బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడు ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, జట్టులో భాగమై బెంచ్‌వార్మింగ్ చేస్తే మ్యాచ్ ఫీజుగా రూ.7.5 లక్షలు అందుకుంటాడు.ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటే, ఈ ఫీజు రూ. 15 లక్షలుగా ఉంటుంది.
ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ మొదటి నుంచి జట్టులో భాగంగా ఉన్నారు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు.రావిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత, జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఏర్పడడంతో తనుష్ కోటియన్‌ను చివరి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేశారు.కానీ అతనికి ఆడే అవకాశమొచ్చింది కాదు.ఈ సిరీస్‌లో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు టెస్ట్ అరంగేట్రం చేసి తమ ముద్ర వేశారు.అలాగే,దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణలకి ఒక్కో మ్యాచ్ ఆడే అవకాశం లభించింది.ఇదే సమయంలో, బెంచ్‌పై ఉండి కూడా సర్ఫరాజ్, అభిమన్యు, తనుష్‌లు మంచి ఆదాయం పొందారు. గతేడాది బీసీసీఐ టెస్ట్ ప్రోత్సాహక పథకం ద్వారా ఫీజులను పెంచింది. 50 శాతం మ్యాచ్‌లు ఆడే ఆటగాడికి రూ. 30 లక్షలు, నాన్-ప్లేయింగ్ ఎలెవెన్ సభ్యుడికి రూ.15 లక్షలు అందుతుంది. అలాగే, 75 శాతం మ్యాచ్‌లు ఆడే ఆటగాడికి రూ. 45 లక్షలు, ఆడని వారికి రూ. 22.5 లక్షల ప్రోత్సాహకం అందుతుంది.