📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా భారత మాజీ క్రికెటర్‌ అజ‌య్‌ జడేజా!

Author Icon By Divya Vani M
Updated: October 12, 2024 • 10:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయల్ ఫ్యామిలీ జామ్ నగర్ సంస్థానం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా ప్రకటించింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ, దసరా పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా శత్రుసల్యసింహ్జీ మాట్లాడుతూ, “పాండవులు తమ 14 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా ముగించిన దసరా పర్వదినం ఎంతో ముఖ్యమైనది. అలాగే, ఈ ప్రత్యేక రోజున అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్ (జామ్ నగర్ పాత పేరు) తర్వాతి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించడంతో, ఈ విజయం నాకు కూడా ఎంతో మహత్తరమైనది. ఇది జామ్ నగర్ ప్రజలకు ఒక గొప్ప వరంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.

జామ్ నగర్ రాజ కుటుంబానికి క్రికెట్ రంగంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రాజ కుటుంబానికి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లతోనే భారత దేశంలో అత్యంత ప్రముఖమైన రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలు ఏర్పాటయ్యాయి. అజయ్ జడేజాకు కూడా ఈ రాయల్ ఫ్యామిలీతో సన్నిహిత అనుబంధం ఉంది.

అజయ్ జడేజా భారత క్రికెట్ జట్టుకు 1992 నుంచి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో 196 వన్డేలు, 15 టెస్టుల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్న జడేజా, రాయల్ ఫ్యామిలీలో కీలక స్థానాన్ని ఆక్రమించడం అతని జీవితంలో మరో గౌరవప్రదమైన ఘట్టంగా నిలుస్తోంది.

Ajay jadeja cricket Nawanagar Jamsaheb Team India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.