📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

క్రికెట్ కు గుడ్‌బై చెప్తున్నా కరుణరత్నే..ఎందుకు?

Author Icon By Divya Vani M
Updated: February 4, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాతో గాలేలో జరగనున్న రెండో టెస్ట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌ను వీడనున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ కరుణరత్నేకు 100వ టెస్ట్ మ్యాచ్‌గా కూడా నిలుస్తుంది.ప్రస్తుతం 36 సంవత్సరాల కరుణరత్నే, ఇటీవల బ్యాటింగ్‌లో స్థిరంగా రాణించలేకపోయాడు కాబట్టి క్రికెట్‌ను వీడే నిర్ణయం తీసుకున్నాడు.గత కొంతకాలంగా కరుణరత్నే ఫామ్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు . తన చివరి 7 టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం 182 పరుగులే సాధించాడు. 2024 సెప్టెంబరులో న్యూజిలాండ్‌పై చేసిన అర్ధ సెంచరీ మాత్రమే అతని తాజా అత్యధిక స్కోరు.2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా కరుణరత్నే టెస్ట్ క్రికెట్‌కు పరిచయమైంది.

క్రికెట్ కు గుడ్‌బై చెప్తున్నా కరుణరత్నే..ఎందుకు

ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ విజయం శ్రీలంకను 10 వికెట్ల తేడాతో గెలిపించింది.ఆ తరువాత కరుణరత్నే శ్రీలంక టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 99 టెస్ట్ మ్యాచ్‌లలో 7,172 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు ఉన్నాయి 2021లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యధిక వ్యక్తిగత స్కోరు 244 రన్న్స్ సాధించాడు.2014లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో తన తొలి సెంచరీ చేశాడు ఆ తరువాత 2015 నుంచి స్థిరంగా రాణిస్తూ, శ్రీలంక జట్టుకు టెస్ట్ ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. 2017లో పాకిస్థాన్‌తో జరిగిన డే-నైట్ టెస్ట్‌లో 196 పరుగులతో తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.2019లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అదే సంవత్సరం, దక్షిణాఫ్రికాపై 2-0 తో టెస్ట్ సిరీస్ గెలిచి, సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించిన మొదటి ఆసియా జట్టుగా శ్రీలంక నిలిచింది కరుణరత్నే 50 వన్డేలు, 34 టీ20లు ఆడాడు.

Dimuth Karunaratne ICC Test Team of the Year Karunaratne Career Karunaratne Retirement Sri Lanka cricket Sri Lanka Test Team Test Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.