हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం

Divya Vani M
ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి శతకం భారత్‌కు కొత్త ఊపును అందించింది.ఓ దశలో ఫాలో ఆన్ ఒత్తిడిలో ఉన్న భారత జట్టును, కేవలం 116 పరుగుల తేడాతో నిలిపి మ్యాచ్‌లో నిలబడేలా చేశాడు.మూడో రోజు ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.నితీష్ రెడ్డి 105 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు, అతనికి మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో తోడుగా ఉన్నాడు.తొలి సెంచరీని సాధించిన నితీష్, భారత జట్టును మ్యాచ్‌లో నిలిపాడు.మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో, ఈ టెస్ట్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం భారత జట్టు 164/5 స్కోరుతో ఆటను కొనసాగించింది. రిషబ్ పంత్ 6 పరుగులు,రవీంద్ర జడేజా 4 పరుగులతో జట్టును ముందుకు నడిపారు.అయితే, ఆస్ట్రేలియా బౌలర్లు తమ ప్రతిభను చాటారు. మొదటి సెషన్‌లో రిషబ్ పంత్ 28 పరుగుల వద్ద ఔటవ్వగా,రవీంద్ర జడేజా 17 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఈ దశలో భారత జట్టు 221/7 స్కోరుతో నిలిచింది.

కానీ, ఇక్కడి నుంచి నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కలిసి మ్యాచ్‌ను మరింత గాడిలో పెట్టారు. నితీష్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 285 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా ఫాలో ఆన్‌ను తప్పించడంతో పాటు జట్టును గౌరవప్రద స్థితిలో నిలిపారు. వాషింగ్టన్ సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేయగా,చివరికి ఆయన ఔటయ్యాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలో మూడు వికెట్లు తీశారు.నాథన్ లియాన్ రెండు కీలక వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడిని పెంచాడు. కానీ,నితీష్ రెడ్డి సూపర్ ఇన్నింగ్స్,సుందర్ సహకారం ఫాలో ఆన్ బెడదను దూరం చేసింది.డిసెంబరు 27న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 474 పరుగుల వద్ద ముగించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

📢 For Advertisement Booking: 98481 12870