తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ఈ ఏడాది సాధారణం కంటే కొద్దిగా ముందుగానే తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 27న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని IMD ప్రకటించడంతో, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవి జూన్ 5లోపే తాకే అవకాశాలున్నాయని చెబుతోంది.
వేగంగా కదులుతున్న రుతుపవనాలు
గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న దేశంలోకి ప్రవేశించి జూన్ 8న తెలంగాణ(Telangana )ను తాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మాత్రం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు, ప్రజలకు ఇది ఊరటనిచ్చే అంశంగా మారింది.
గతంలో కంటే ఎక్కువ వర్షపాతం
ఇంతకుముందే IMD ఈ సంవత్సరం సాధారణాన్ని మించిపోయే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. వ్యవసాయం, నీటి నిల్వలు, పంటలు మొదలైన అంశాల్లో ఇది ఎంతో సహాయపడనుంది. వర్షాకాలం త్వరగా ప్రారంభమవుతోందన్న వార్తతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా వ్యవసాయ రంగానికి అవసరమైన ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతోంది.
Read Also : Modi Speech : వావ్.. మోదీ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు – పవన్